కేవలం రూ.1కే కాల్స్, ఇంటర్నెట్ ఫ్రీ.. కొన్ని రోజులే అవకాశం..

Venkatrao Lella

Images: Pinterest

19 NOV 2026

బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ.1కే సిమ్ కార్డుతో పాటు డేటా, కాల్స్ చేసుకునే సదపాయం కల్పించునుంది. ఇందుకోసం ఫ్రీడమ్ 2.0 అనే ప్లాన్ తీసుకొచ్చింది.

ఈ ప్లాన్‌లో భాగంగా కేవలం రూ.1కే బీఎస్‌ఎన్ఎల్ సిమ్ అందించనుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు

24 రోజుల పాటు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం రూ.1తో సిమ్ తీసుకుంటే 24 రోజుల పాటు ఉచిత కాల్స్,  ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ల సదుపాయాలు లభిస్తాయి

ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ స్పష్టం చేసింది. 24 రోజుల వ్యాలిడిటీ పూర్తయిన తర్వాత వినియోగదారులు తమకు నచ్చిన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుని సేవలు వినియోగించుకోవచ్చు.

ఇటీవల కస్టమర్లను పెంచుకునే క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ అనేక ఆఫర్లను ప్రవేశపెడుతోంది. తక్కువ ధరతో కూడిన ప్లాన్లను తీసుకొస్తుంది. దీంతో కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది.

ప్రస్తుతం ప్రతీఒక్కరి ఫోన్లలో స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. టెక్నాలజీ యుగంలో ఇంటర్నెట్ సుదుపాయం అనేది తప్పనిసరిగా మారింది. దీంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతోంది.

మీ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ కార్యాలయం లేదా రిటైలర్‌ను సంప్రదించి రూ.1కే సిమ్ పొందవచ్చు. కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌లో కొత్తగా చేరే కస్టమర్లకు ఇది వర్తించనుంది.

ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరినవారికి లేదా పోర్ట్ పెట్టుకుున్నవారికి ఫ్రీడమ్ ఆఫర్ వర్తించదని తెలుసుకోవాలి. ఈ అవకాశాన్ని కొత్త కస్టమర్లు ఉపయోగించుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ చెబుతోంది

రెండు నెలల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. దీంతో అప్పటివరకు చేరినవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.