AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? బాటిళ్లపై ఆ తేదీ ఎందుకు వేస్తారు? అసలు నిజం ఇదే!

మనం రోజూ తాగే నీటికి కూడా గడువు ముగిసే తేదీ ఉంటుందా? దుకాణాల్లో కొనే వాటర్ బాటిళ్లపై ఎక్స్‌పైరీ తేదీ ఎందుకు కనిపిస్తుంది? అనే ప్రశ్న చాలామందికి వస్తుంటుంది. శాస్త్రీయంగా చూస్తే స్వచ్ఛమైన నీటికి ఎక్స్‌పైరీ తేదీ ఉండదు. నీరు ఒక అకర్బన పదార్థం. అది ఆహార పదార్థంలా కుళ్లిపోవడం లేదా పాడైపోవడం జరగదు. అయితే, మరీ బాటిళ్లపై తేదీ ఎందుకు ఉంటుంది?

నీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? బాటిళ్లపై ఆ తేదీ ఎందుకు వేస్తారు? అసలు నిజం ఇదే!
Water Expiry Date
Jyothi Gadda
|

Updated on: Nov 23, 2026 | 1:17 PM

Share

నీటికి స్వతహాగా గడువు ముగిసే తేదీ ఉండదు. కోట్లాది సంవత్సరాలుగా భూమిపై ఉన్న నీరు అలానే ఉంది. అయితే మనం కొనే ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లపై బెస్ట్ బిఫోర్ లేదా ఎక్స్‌పైరీ తేదీ ముద్రించి ఉండటం చాలామందిని గందరగోళానికి గురి చేస్తుంది. ఆ తేదీ నీరు పాడైపోతుందని కాదు, కాలక్రమేణా ప్లాస్టిక్ సీసా నాణ్యత క్షీణించి రసాయనాలు నీటిలో కలిసే అవకాశం ఉంటుందని సూచించడానికి వేస్తారు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సీసాలపై కనిపించే తేదీలు నీటి కోసం కాదు, ప్రధానంగా ఆ ప్లాస్టిక్ కంటైనర్ భద్రత, నియంత్రణ ప్రమాణాల కోసం ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు లేదా వేడి, సూర్యరశ్మి తగిలినప్పుడు ప్లాస్టిక్ బాటిల్ నాణ్యత తగ్గి, దానిలోని సూక్ష్మ రసాయనాలు నీటిలోకి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఒక నిర్దిష్ట కాలపరిమితిలోపు వాడాలని సూచించడానికి ఆ తేదీని ముద్రిస్తారు.

సీసా తెరిచిన తర్వాత ఏమవుతుంది?

సీలు చేసిన వాటర్ బాటిల్‌ను చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ ఉంచితే చాలాకాలం పాటు సురక్షితంగానే ఉంటుంది. కానీ ఒకసారి మూత తీసిన తర్వాత బయటి గాలి, చేతుల ద్వారా బాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు నీటిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అప్పుడు నీటి రుచి మారడం లేదా కలుషితం కావడం జరగవచ్చు. అందుకే తెరిచిన బాటిల్‌లోని నీటిని కొన్ని రోజుల్లోపే తాగేయడం మంచిది.

నిల్వ చేసే విధానం ముఖ్యం

నీటిని ఎండ తగిలే చోట, వేడిగా ఉండే ప్రదేశాల్లో లేదా రసాయనాల దగ్గర నిల్వ ఉంచకూడదు. ముఖ్యంగా వేడి వాతావరణంలో ఉంచిన ప్లాస్టిక్ సీసాలలోని నీటిని ఎక్కువ కాలం దాచకుండా జాగ్రత్త పడాలి.

ఇవి కూడా చదవండి

మొత్తానికి, చెడిపోయేది నీరు కాదు—సరైన నిల్వ లేకపోతే నీటి నాణ్యత, లేదా ఆ సీసా భద్రత మాత్రమే ప్రమాదంలో పడతాయి. నీటిని శుభ్రమైన పాత్రల్లో, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us