జి. జ్యోతి తెలుగు మీడియాలో 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012లో 10టీవీతో జర్నలిజంలో అడుగుపెట్టాను. రెండేళ్ల పాటు 10టీవీలోనే వర్క్ చేశాను. ఆ తరువాత ప్రముఖ మీడియా సంస్థలు, ఆంధ్రప్రభ, టీ న్యూస్, స్నేహా టీవీలో పనిచేసి విలువైన సేవలు అందించాను. 2017లో టీవీ 9లో చేరాను. ఇక్కడ ఏక్ నంబర్ నంబర్ బులిటెన్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. వాయిస్ ఓవర్, డిజిటల్ టెక్ట్స్ స్టోరీస్ యూట్యూబ్ కోసం రాశాను. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సీనియర్ సబ్ఎడిటర్గా పని చేస్తున్నాను. రిజినల్ న్యూస్, వైరల్ వార్తలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫుడ్, బ్యూటీకి సంబంధించిన సరికొత్త విషయాలను సేకరించి అందిస్తున్నాను.
కూల్ వెదర్లో హాట్ చాక్లెట్.. హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..! వెంటనే మొదలుపెట్టేస్తారు..
స్వచ్ఛమైన కోకో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లతో నిండి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో హాట్ చాక్లెట్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది. చలి నుంచి ఉపశమనం, సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ అందిస్తుంది.
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 9:54 pm
మునగ మంచిది అనుకుంటే ముంచేస్తుందని తెలుసా..? వీళ్లు అసలు ముట్టనే కూడదట..!
మునగకాయలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం. ఇవి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే, గర్భిణీలు, తక్కువ రక్తపోటు ఉన్నవారు, దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు లేదా అధిక రక్తస్రావం ఉన్న మహిళలు మునగకాయలను దూరంగా ఉంచాలి. దీని వేడి స్వభావం, అధిక ఫైబర్ కొన్ని ఆరోగ్య పరిస్థితులకు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 9:44 pm
Pomegranate Leaves: దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
దానిమ్మ మంచి రుచికరమైన పండ్లను అందించే ఔషధ మొక్క. కేవలం దానిమ్మ పండ్లు మాత్రమే కాదు.. ఈ చెట్టు ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని తెలిస్తే మీరు నమ్మలేరు. దానిమ్మ మొక్కలోని ప్రతి భాగాన్ని ఔషధంగా ఉపయోగించవచ్చు. దానిమ్మ ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయి. ఎన్నో జబ్బులను నయం చేసే గుణం ఉంటుంది. దానిమ్మ చెట్టు ఆకుల ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 9:32 pm
బంగారం ధర 2026లో కుప్పకూలుతుందా..?
పెళ్లిళ్ల సీజన్ ఉండడం, మార్కెట్ లో బంగారానికి డిమాండ్ పెరగడం, అమెరికా వడ్డీ రేట్లపై ఆశలు, డాలర్ బలహీనతతో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 9:12 pm
ఎగ్‌వైట్ తిని ఎల్లో వదిలేస్తున్నారా..? అయితే మీరు ఎంత నష్టపోతున్నారో తెలిస్తే..
గుడ్డు పచ్చసొనలో విటమిన్లు A, D, E, K, కోలిన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలం. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బరువు తగ్గడానికి, కండరాల నిర్మాణానికి పూర్తి గుడ్లు ఉత్తమం. తెల్లసొన మాత్రమే తినడం వల్ల కీలక పోషకాలు వృథా అవుతాయి. 2-3 పచ్చసొనలు రక్త కొలెస్ట్రాల్ పెంచవని అధ్యయనాలు చెబుతున్నాయి.
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 8:29 pm
Health Tips: నెయ్యితో ఆటలు వద్దు.. వీళ్లకు విషమే..! ఎవరు తినకూడదో తెలుసా?
ఆయుర్వేదం ప్రకారం నెయ్యి ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ, అందరికీ సరిపడదు. బరువు తగ్గాలనుకునేవారు, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి. అధిక నెయ్యి సేవనం వల్ల బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, మొటిమలు వంటి దుష్ప్రభావాలు రావచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నెయ్యి తీసుకోవడం పరిమితం చేయాలి.
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 8:04 pm
ఉదయాన్నే ఈ టీ తాగితే.. అందం, ఆరోగ్యం రెట్టింపు!
ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడటానికి, వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడంలో, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 7:29 pm
RBI Unlimited Money Printing: ఆర్బీఐ అన్లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?
ఆర్బిఐకి నోట్లను ముద్రించే అధికారం ఉంది. మరి అది అపరిమిత నోట్లను ఎందుకు ముద్రించదు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపరిమిత నోట్లను ముద్రించడం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలు మీ మనసులో కూడా వస్తుంటాయి కదా..? అయితే, ఇక్కడ మీకు సమాధానాలను ఉన్నాయి. ఆర్బిఐ అపరిమిత నోట్లను ముద్రిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇక్కడ చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 7:03 pm
విమాన భద్రత రహస్యం.. కోడిపిల్లకి, జెట్ ఇంజిన్ కి సంబంధం ఏమిటో తెలుసా..?
విమాన ప్రయాణాలలో పక్షులు ఢీకొనడం (బర్డ్ స్ట్రైక్) పెద్ద ముప్పు. దీన్ని నివారించడానికి 'చికెన్ గన్' అనే విచిత్రమైన భద్రతా పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో చనిపోయిన కోళ్లను విమాన ఇంజిన్లపై కాల్చి, పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్ ఎంత సురక్షితంగా ఉంటుందో పరీక్షిస్తారు. ఢిల్లీ, ముంబై వంటి విమానాశ్రయాలలో ఇది కీలకమైన భద్రతా విధానం. ఇది ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతుంది.
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 6:42 pm
పెళ్లి విందుకు వచ్చిన చిరుత.. భయంతో పరుగులుపెట్టిన అతిథులు..! ఆ తర్వాత జరిగింది చూస్తే..
పెళ్లి విందు జరుగుతున్న ఒక ప్రదేశంలోకి హఠాత్తుగా ఒక చిరుతపులి ప్రవేశించింది. చిరుతను చూసిన పెళ్లి బృందం ఒక్కసారిగా హడలెత్తిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఎటు చూసినా జనం అరుపులు, కేకలతో భయానక వాతావరణం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 5:51 pm
Guinness World Record: పైనాపిల్ తొక్కతీసి ప్రపంచ రికార్డ్.. అసలు సంగతి తెలిస్తే…
ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించే ప్రత్యేక మార్గాలు ప్రజల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. కొన్నిసార్లు స్పీడ్ రేసింగ్, కొన్నిసార్లు హై జంపింగ్, కొన్నిసార్లు తినడం, మరికొన్ని సార్లు తాగడం వంటి పనులకు సంబంధించిన విన్యాసాలు ముఖ్యాంశాలలో నిలుస్తాయి. ఈ సిరీస్‌లో మరో వింత పని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. UKలోని విస్బెక్లో డెల్ మోంటే కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో ఈ చారిత్రాత్మక రికార్డు సృష్టించబడింది. ఇంతకీ ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఆ పని ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..పూర్తి వివరాల్లోకి వెళితే...
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 4:52 pm
Viral video: ఒకప్పుడు విదేశాల్లో టెకీ.. ఇప్పుడు బిచ్చగాడు..! ఈ ధనవంతుడి విషాద కథ తెలిస్తే..
అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీలో చదువుకున్నాడు.. ఆ తరువాత బెంగళూరులోని ఓ ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. అంతలోనే అతని తలరాత పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడదే బెంగళూరులోని జయనగర్ వీధుల్లో తాగుబోతుగా మారి బిచ్చమెత్తుకునేలా చేసింది. మద్యానికి బానిసైన అతను తన కథను ఇలా చెప్పుకున్నాడు.. తనతో పంచుకున్న విషయాన్ని శరత్ యువరాజా అనే యువకుడు తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో అందరినీ కలచివేస్తోంది.
- Jyothi Gadda
- Updated on: Dec 18, 2025
- 4:10 pm