AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం

పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 16, 2026 | 9:23 PM

Share

నాయికలు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, బలమైన కథలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రద్ధా కపూర్ 'స్త్రీ', కల్యాణి ప్రియదర్శన్ 'లోకా' విజయాలు దీనికి నిదర్శనం. అదా శర్మ 'సూపర్ వెల్లి'తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. మంచి కథ దొరికితే నాయికలు అద్భుతాలు సృష్టిస్తారని, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

పర్ఫెక్ట్ కథ పడాలేగానీ, స్క్రీన్‌ మీద చెలరేగిపోవడానికి మేం ఎప్పుడూ రెడీగానే ఉన్నామని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రూవ్‌ చేస్తూనే ఉన్నారు నాయికలు. నార్త్ లో స్త్రీ కాన్సెప్ట్ తో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్నారు శ్రద్ధాకపూర్‌. సౌత్‌ లో ఈ రూట్లోనే ట్రావెల్‌ చేస్తు్న్నారు కల్యాణి. కొత్తగా వీళ్ల రూట్లోకి వచ్చిన సూపర్ గర్ల్ ఎవరు? స్త్రీ సినిమాటిక్‌ యూనివర్శ్‌ కి నార్త్ లో ఎంత క్రేజ్‌ ఉందో స్పెషల్‌ గా మెన్షన్‌ చేయక్కర్లేదు. నా వల్లే ఆడిందంటే నా వల్లే ఆడిందంటూ ఆర్టిస్టులు స్పెషల్‌ గా క్లెయిమ్‌ చేసుకున్నారంటేనే మూవీ రేంజ్‌ ఎలాంటిదో అర్థమైందంటున్నారు క్రిటిక్స్. ఈ సినిమాతో మార్కెట్‌ రేట్‌ని అమాంతం పెంచేసుకున్నారు శ్రద్ధా కపూర్‌. నార్త్ లో శ్రద్ధాకపూర్‌కి వచ్చిన క్రేజ్‌ సౌత్‌ లో ఇప్పుడు కల్యాణి ప్రియదర్శన్‌కి ఉంది. ఆమె నటించిన లోకా చాప్టర్ 1 కి సూపర్‌ క్రేజ్‌ వచ్చింది. అందుకే ఇప్పుడు సెకండ్‌ పార్టుకి కూడా రెడీ అవుతున్నారు మేకర్స్. పర్ఫెక్ట్ కథని కన్విన్సింగ్‌గా చెబితే ఆడియన్స్ కాసులు కురిపిస్తారని ఈ సూపర్‌ కాన్సెప్ట్ ప్రూవ్‌ చేసిందని అంటున్నారు కల్యాణి. సూపర్‌ గర్ల్ కాన్సెప్ట్ తో తాను చేస్తున్న ‘సూపర్‌ వెల్లి’ మూవీ కచ్చితంగా గ్లామర్‌ ఇండస్ట్రీలో అద్భుతంగా క్లిక్‌ అవుతుందన్నది అదా శర్మ చెబుతున్న మాట. ఆ మధ్య కేరళ స్టోరీతో మెప్పించిన అదా శర్మ, ఇప్పుడు సూపర్‌ వెల్లిగా ఎలాంటి మేజిక్‌ చేస్తారోననే టాక్‌ ఆల్రెడీ మొదలైంది. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గానూ నటిస్తున్నారీ బ్యూటీ. ఈ సినిమా క్లిక్‌ అయతే త్వరలోనే మరిన్ని సూపర్‌ గర్ల్స్ మూవీస్‌ క్యూ కట్టడం ఖాయం అన్నమాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా

Rashmika: రష్మిక కాక్‌టైల్‌ పార్టీ డేట్‌ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా

Nayanthara: ఆరు జనరేషన్ల హీరోలతో కలిసి వర్క్ చేసిన బ్యూటీ

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌… రికార్డులు బ్రేక్ అవుతాయా ??

వెండితెర మీద కొత్త ప్రపంచాలు… లెక్క సరిపోతుందా ??

Follow Us