తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున వందేమాతరం గీతాలాపనపై వివాదం చోటుచేసుకుంది. వందేమాతరం ప్లే చేయడాన్ని నిరసిస్తూ ఎంఐఎం సభ్యులు, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ సహా సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.