AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer AC Tips: సమ్మర్‌లో ఏసీ వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలా? జస్ట్ ఇవి పాటిస్తే చాలు 100 కూడా దాటదు!

సమ్మర్ వచ్చేసింది.. ఇక కచ్చితంగా ఇంట్లో ఏసీనో, లేదా కూలరో ఉండాల్సిందే.. లేదంటే ఒక్క క్షణంగా కూడా కూర్చొలేం. కాబట్టి కచ్చితంగా మన ఏసీ వాడే తీరాలి. అయితే ఎండా కాలంలో ఎక్కువగా ఏసీ వాడడం వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. కానీ మీరు ఇప్పుడు మేం చెప్పబోయే విధానంలో ఏసీని వాడితే మీకు కరెంటు బిల్లు చాలా తక్కువగా వస్తుంది. అవును అదెలాలో తెలుసుకుందాం పదండి.

Summer AC Tips: సమ్మర్‌లో ఏసీ వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలా? జస్ట్ ఇవి పాటిస్తే చాలు 100 కూడా దాటదు!
Ac Power Saving Tips
Anand T
|

Updated on: Mar 17, 2026 | 8:15 AM

Share

ఈ సారి మార్చి మొదటి వారంలోనే సూర్యుడి తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ప్రజలపై తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇక మధ్యాహ్నం అయిందంటే చాలూ మాడు పగిలే ఎండలతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి జనాలు ఇంట్లో ఏసీ, కూలర్లు పెట్టక తప్పట్లేదు. అయితే అప్పటి పూర్తికి చల్లగా ఉండాలని ఏసీ పెట్టుకుంటే నెలాఖరులో వచ్చే కరెంటు బిల్లు చూసి షాక్ అవ్వాల్సిందే. ఈ కరెంటు బిల్లుకు బయపడే చాలా మంది ఇంట్లో ఏసీ ఉన్నా ఉపయోగించరు. అలాంటి వారికోసమే మేం కొన్ని సింపుల్ టిప్స్ చెప్పబోతున్నాం. ఈ టిప్స్ పాటిస్తే మీ కరెంటు బిల్లును చాలా వరకు ఆదా చుసుకోవచ్చు.

అవును, మీరు AC వాడేటప్పుడు కొన్ని విషయాలపై శ్రద్ధ వహిస్తే, మీ విద్యుత్ బిల్లును సగం వరకు తగ్గించుకోవచ్చు. చాలా మంది ఏసీ ఆన్ చేసి 16 లేదా 18 డిగ్రీలకు సెట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల రూమ్ త్వరగా కూల్ అవుతుందనేది అపోహ మాత్రమే. అలా చేయడం వల్ల కంప్రెసర్ ఎక్కువసేపు పనిచేసి విద్యుత్ వృధా అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 24°C మానవ శరీరానికి ఉత్తమ ఉష్ణోగ్రత. ప్రతి డిగ్రీ పెరుగుదలకు, దాదాపు ఆరు శాతం విద్యుత్ ఆదా అవుతుంది.

AC ఉన్న ఫ్యాన్ వాడటం; AC నడుపుతున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ పెట్టుకోవడం మంచింది. ఇది AC నుండి వచ్చే చల్లని గాలిని త్వరగా గది మొత్తం వ్యాపించేలా చేస్తుంది. దీంతో గదిని వేగంగా చల్లబరుస్తుంది. మీ విద్యుత్ బిల్లును తగ్గించడానికి ఇది ఒక గొప్ప మార్గం. అలాగే AC ఉపయోగిస్తున్నప్పుడు, తలుపులు, కిటికీలు, అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు మూసి ఉంచండి. ఇది కూడా కరెంటు బిల్లు తగ్గేందుకు సహాయపడుతుంది.

సర్వీసింగ్ మర్చిపోవద్దు: AC ఫిల్టర్లపై దుమ్ము పేరుకుపోవడం వల్ల గాలి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అలాగే అనారోగ్యాలు వస్తాయి. దీనివల్ల కంప్రెసర్ ఎక్కువ పని చేస్తుంది. ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఫిల్టర్లను కనీసం నెలకు ఒకసారి శుభ్రం చేయడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.

స్లీప్ మోడ్‌ను: రాత్రి పడుకున్న తర్వాత, మన శరీరం పగటిపూట ఉన్నంత వేడిగా అనిపించదు. మీరు ACలో ‘స్లీప్ మోడ్’ని ఉపయోగిస్తే, కూలింగ్ ప్రతి గంటకు కొద్దిగా సర్దుబాటు అవుతుంది. ఉదయం ACని ఆటోమేటిక్‌గా ఆఫ్ చేయడానికి ‘టైమర్’ను సెట్ చేయడం కూడా మంచిది. లేకపోతే, మీరు ఒక గంట పాటు ACని ఆన్ చేసి, ఆపై ఫ్యాన్ ఆన్ చేసి నిద్రపోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us