కడప జిల్లా బీకోడూరులోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలోకి పాము ప్రవేశించడంతో తీవ్ర కలకలం రేగింది. పరీక్ష రాస్తున్న విద్యార్థులు భయంతో పరుగులు తీయగా, అప్రమత్తమైన సిబ్బంది పామును పట్టుకుని బయట పడేశారు. ప్రమాదం తప్పడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవి వేడి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పరిశుభ్రతకు అధికారులు సూచించారు.