శివాలయానికి వెళ్లారు.. హుండీ దోచారు.. దేవుడిని కూడ వదలరా
కృష్ణా జిల్లా యానమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ₹10 లక్షల హుండీ చోరీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేవాదాయ శాఖ ఈవో భవానిని సస్పెండ్ చేయగా, ప్రధాన అర్చకుడు సాగర్, మరో అర్చకుడు పూర్ణ అరెస్టు అయ్యారు. ట్రస్ట్ చైర్మన్ నరసింహారావు ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభమైంది.
కృష్ణా జిల్లాలోని యానమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన హుండీ చోరీ కేసులో దేవాదాయ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై సీరియస్ అయిన దేవాదాయ శాఖ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) భవానిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆలయ హుండీ కానుకల మాయం, ఇతర అక్రమ వ్యవహారాల ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ చోరీ వ్యవహారంలో, దాదాపు ₹10 లక్షల రూపాయల కానుకలు మాయమైనట్లు గుర్తించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ నరసింహారావు ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఆలయ ప్రధాన అర్చకుడు సాగర్, మరొక అర్చకుడు పూర్ణ, మరియు ఈవో భవాని పాత్ర ఉన్నట్లు తేలింది. పోలీసులు ఇప్పటికే అర్చకులు సాగర్, పూర్ణలను అరెస్టు చేయగా, ఈవో భవాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆలయానికి కొత్త ఈవోగా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెర్రీ రూట్లో నాని.. మరి వీడియో ఎక్కడ ??
Dhurandhar 2: ధురంధర్ కెప్టెన్‌కి.. వర్మ వార్నింగ్.. జర భద్రం
పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం
Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా
Rashmika: రష్మిక కాక్‌టైల్ పార్టీ డేట్ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

