టాలీవుడ్లో స్టార్ హీరోలు బ్యాక్-టు-బ్యాక్ రిలీజ్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఏడాది వ్యవధిలో మూడు చిత్రాలతో సందడి చేయనున్నారు. వెంకటేశ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, రవితేజ, నాని, శర్వానంద్ సైతం వరుసగా తమ చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ట్రెండ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కలిసి వచ్చే అంశం.