AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు తెలుసా? మీ శరీరం కంటే ముందే మీ జీర్ణక్రియ వృద్ధాప్యం బారిన పడుతోందని..ఈ అలవాట్లే దానికి కారణం!

చాలా మంది ముఖంపై ముడతలు పడకుండా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, లోపల ఉన్న జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. వాస్తవానికి, మన ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మన పొట్ట (Gut) పైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే, మీ శరీరం కంటే మీ గట్ వేగంగా వయసు పైబడినట్లు ప్రవర్తిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ క్రింది అలవాట్లు మీ జీర్ణవ్యవస్థను ముసలిదిగా మారుస్తున్నాయి. అవేంటో తెలుసుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది.. మీ కోసమే ఈ కథనం!

మీకు తెలుసా? మీ శరీరం కంటే ముందే మీ జీర్ణక్రియ వృద్ధాప్యం బారిన పడుతోందని..ఈ అలవాట్లే దానికి కారణం!
Habits That Damage Your Gut
Jyothi Gadda
|

Updated on: Mar 16, 2026 | 7:59 AM

Share

వయసు పెరుగుతున్నా కొద్దీ జీర్ణక్రియ బలహీనపడటం సహజం. కానీ, నేటి జీవనశైలి కారణంగా చాలా మందిలో శరీరం కంటే ముందే జీర్ణవ్యవస్థ ముసలిదైపోతోంది. మన పొట్టలో ఉండే మైక్రోబయోమ్ (మంచి బ్యాక్టీరియా) సమతుల్యత దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం, తక్కువ ఫైబర్ ఉన్న డైట్, అతిగా యాంటీబయాటిక్స్ వాడటం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటివి జీర్ణవ్యవస్థను వేగంగా బలహీనపరుస్తాయి. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే, ఆహారంలో పెరుగు వంటి ప్రోబయోటిక్స్‌ను చేర్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం ద్వారా మీ గట్ హెల్త్‌ను మళ్లీ యవ్వనంగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

1. ప్రాసెస్ చేసిన ఆహారం, తక్కువ ఫైబర్: నేటి కాలంలో ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం పెరిగింది. వీటిలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ (పీచు పదార్థం) చాలా తక్కువగా ఉంటుంది. ఇది పొట్టలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేసి, జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది.

2. అతిగా మందులు వాడటం: చిన్నపాటి నొప్పి వస్తే చాలు వెంటనే పెయిన్ కిల్లర్స్ లేదా యాంటీబయాటిక్స్ వేసుకోవడం చాలా మందికి అలవాటు. ఇవి పొట్టలోని సూక్ష్మజీవుల సమతుల్యతను దెబ్బతీస్తాయి. డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం మీ గట్ హెల్త్‌కు అస్సలు మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

3. ఒత్తిడి, నిద్రలేమి: మెదడుకు, పొట్టకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. మీరు నిరంతరం ఒత్తిడికి గురైతే లేదా సరిగ్గా నిద్రపోకపోతే, అది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

4. శారీరక శ్రమ లేకపోవడం: రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుదనం తగ్గుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో మైక్రోబయోమ్ వైవిధ్యం బాగుంటుందని, తద్వారా జీర్ణక్రియ యవ్వనంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడం ఎలా?: మీరు మీ డైట్‌లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, పెరుగు లేదా ఇతర పులియబెట్టిన ఆహారాలను (Fermented foods) చేర్చుకోవాలి. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర, రోజూ 30 నిమిషాల వ్యాయామం మీ జీర్ణవ్యవస్థను మళ్లీ శక్తివంతంగా మారుస్తాయి. మీ జీర్ణక్రియ బాగుంటేనే మీరు ఉత్సాహంగా ఉండగలరు. మీ గట్ హెల్త్‌ను కాపాడుకోవడం ద్వారా అకాల వృద్ధాప్యాన్ని అరికట్టవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు
కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు
సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
బంగారు తీగ చేపల్ని చుక్కనూనె లేకుండా అరిటాకులో ఇలా చేసేయండి
బంగారు తీగ చేపల్ని చుక్కనూనె లేకుండా అరిటాకులో ఇలా చేసేయండి
డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? అసలు సీక్రెట్స్ ఇదే
డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? అసలు సీక్రెట్స్ ఇదే
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్
లవర్స్ తెగ పాడుకున్న పాట..
లవర్స్ తెగ పాడుకున్న పాట..
చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
మీరు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? భారతీయుల్లో పెరుగుతున్న ప్రీడయాబెటిస్
మీరు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? భారతీయుల్లో పెరుగుతున్న ప్రీడయాబెటిస్
శరీరంలో వేడిని తగ్గించే మెత్తని రవ్వ లడ్డు.. 10 నిమిషాల్లోనే..
శరీరంలో వేడిని తగ్గించే మెత్తని రవ్వ లడ్డు.. 10 నిమిషాల్లోనే..
పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 విషయాలు తెలుసుకోండి
పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 విషయాలు తెలుసుకోండి