చలికాలంలో గుండె పోటు ముప్పు.. తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

samatha

29 November 2026

Pic credit - Pinterest

చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది గుండె పోటు బారిన పడుతుంటారు. ఈ సమయంలో గుండెపై చాలా ప్రభావం పడుతుంది.

చలికాలం

అందుకే చాలా మంది వైద్య నిపుణులు ఈ సమయంలో గుండె ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు.

గుండె ఆరోగ్యం

కాగా, ఇప్పుడు మనం చలికాలంలో గుండె పోటు ముప్పు ఎందుకు ఉంటుంది. దీని నుంచి బయటపడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

గుండె పోటు ముప్పు

చలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం తన వేడిని కాపాడుకోవడానికి రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేస్తుంది. ఇది అధిక రక్తపోటుకు కారణం అవుతుంది.

రక్తనాళాలు

దీని వలన గుండె వేగం పెరగడం, గుండెపై అదనపు ఒత్తిడి పడి, గుండె పోటు రావడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.

గుండెపై ఒత్తిడి

అందువలన వీలైనంత వరకు చల్లటి వాతావరణానికి చాలా దూరంగా ఉండాలి. బయటకు వెళ్లే ముందు వెచ్చని దుస్తులు ధరించాలి.

చల్లటి వాతావఱణం

అంతే కాకుండా వ్యాయామం కూడా తప్పనిసరి. ప్రతి రోజూ శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం కోసం తేలికపాటి వ్యాయామం చేయాలి.

వ్యాయామం

మంచి ఆహారాలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్  ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి.

సమతుల్య ఆహారం