AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌..? తేడాలు ఇవే!

నేటి కాలంలో బైక్‌లు, కార్లలో ట్యూబ్‌లెస్ టైర్ల వాడకం వేగంగా పెరుగుతోంది. చాలామంది వాహనదారులకు ట్యూబ్ టైర్లకు, ట్యూబ్‌లెస్ టైర్లకు మధ్య అసలు తేడా ఏమిటి? ఏది ఎక్కువ సురక్షితం? అనే సందేహాలు ఉంటాయి. ఈ రెండింటి నిర్మాణం, పనితీరులో కీలకమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌..? తేడాలు ఇవే!
Tube Tyres Vs Tubeless Tyre
Jyothi Gadda
|

Updated on: Nov 23, 2026 | 11:35 AM

Share

వాహనాల టైర్లలో ట్యూబ్ టైర్లు, ట్యూబ్‌లెస్ టైర్ల మధ్య భద్రత, మన్నిక, నిర్వహణ పరంగా ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ట్యూబ్ టైర్లలో లోపల రబ్బరు ట్యూబ్ ఉండి గాలిని నిల్వ చేస్తుంది. మేకు గుచ్చుకుంటే గాలి వేగంగా తగ్గి వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్లలో ప్రత్యేక ట్యూబ్ ఉండదు. టైర్ లోపలి పొర, రిమ్ కలిసి గాలిని పట్టి ఉంచుతాయి. పంక్చర్ అయినా గాలి నెమ్మదిగా తగ్గుతుంది. కాబట్టి రహదారిపై భద్రత ఎక్కువగా ఉంటుంది. ఇవి తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తూ ఇంధన సామర్థ్యాన్ని పెంచుతాయి. అయితే ప్రారంభ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో పంక్చర్ రిపేర్ కొంత కష్టంగా ఉండవచ్చు.

నిర్మాణం, గాలి నిల్వ

ట్యూబ్ టైర్లలో టైర్ లోపల ప్రత్యేకమైన రబ్బరు ట్యూబ్ అమర్చి దానిలో గాలి నింపుతారు. ఆ ట్యూబ్‌పై బయటి టైర్ కవచంలా ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్లలో లోపల ఎలాంటి ట్యూబ్ ఉండదు. టైర్ లోపలి లైనింగ్, వీల్ రిమ్ కలిసి గాలి బయటకు పోకుండా గట్టిగా సీల్ చేస్తాయి.

పంక్చర్ సమయంలో భద్రత

ఇది అత్యంత కీలకమైన తేడా. హైవేపై వేగంగా వెళ్తున్నప్పుడు ట్యూబ్ టైర్‌కు మేకు లేదా పదునైన వస్తువు గుచ్చుకుంటే ట్యూబ్ వెంటనే పగిలి గాలి వేగంగా బయటకు పోతుంది. దీనివల్ల వాహనం అదుపు తప్పే ప్రమాదం ఏర్పడుతుంది. అదే ట్యూబ్‌లెస్ టైర్‌కు మేకు గుచ్చుకున్నా, ఆ మేకు రంధ్రం వద్దే అడ్డుగా ఉండి గాలి నెమ్మదిగా తగ్గుతుంది. దీంతో వాహనాన్ని సురక్షితంగా పక్కకు నిలిపే సమయం దొరుకుతుంది.

ఇవి కూడా చదవండి

వేడి, బరువు, మైలేజ్

ట్యూబ్ టైర్లలో ట్యూబ్, టైర్ మధ్య రాపిడి వల్ల ఎక్కువ వేడి పుడుతుంది. బరువు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్లు తేలికగా ఉండటంతో పాటు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల రోలింగ్ రెసిస్టెన్స్ తగ్గి, వాహన మైలేజ్ మెరుగుపడేందుకు సహాయపడుతుంది.

ఖర్చు, మరమ్మతులు

ట్యూబ్‌లెస్ టైర్ల ప్రారంభ ధర ట్యూబ్ టైర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ట్యూబ్‌లెస్ పంక్చర్లను టైర్ విప్పకుండానే సులభంగా వేయవచ్చు. కానీ చాలా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో లేదా అధునాతన పరికరాలు లేని చోట ట్యూబ్ టైర్ల మరమ్మతులు సులభంగా దొరకవచ్చు.మొత్తానికి, ఎక్కువ దూర ప్రయాణాలు, మెరుగైన భద్రత, తక్కువ నిర్వహణ ఇబ్బందులు కోరుకునే వారికి ట్యూబ్‌లెస్ టైర్లు మంచి ఎంపికగా నిలుస్తాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌? తేడాలు
ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌? తేడాలు
కళ్యాణ్ రామ్ భార్య గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కళ్యాణ్ రామ్ భార్య గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..
ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్
ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్
క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి
క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి
చలికాలంలో నోటికి కమ్మదనాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.
చలికాలంలో నోటికి కమ్మదనాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.
ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.. బంగారు రెక్కల హంస కథ!
ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.. బంగారు రెక్కల హంస కథ!
ఇంటి పనులకు వచ్చిన జేసీబీ డ్రైవర్‌తో ప్రేమలోపడ్డ యువతి,కట్‌చేస్తే
ఇంటి పనులకు వచ్చిన జేసీబీ డ్రైవర్‌తో ప్రేమలోపడ్డ యువతి,కట్‌చేస్తే
బంగారం ధరల్లో భారీ జంప్.. సోమవారం లేటెస్ట్ ధరలివే..
బంగారం ధరల్లో భారీ జంప్.. సోమవారం లేటెస్ట్ ధరలివే..