AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రైనేజీ కాలువ తవ్వకాల్లో బయటపడ్డ రూ. 99 కోట్ల బంగారు నిధి.. ఎగబడిన జనం..!

సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. డ్రైనీజీ పైపుల కోసం తవ్వకాలు జరుపుతుండగా ఊహించని అద్భుతం చోటుచేసుకుంది. నిర్మాణ పనుల్లో భాగంగా 18 ఏళ్ల కోబే అనే విద్యార్థి, తన తోటి కూలీలతో కలిసి తవ్వుతుండగా సుమారు రూ. 98 నుండి 99 కోట్ల (9 మిలియన్ యూరోలు) విలువైన భారీ బంగారు నిధి బయటపడింది. ఇందులో అరుదైన బంగారు నాణేలు, నంబర్లు కలిగిన 50కి పైగా బంగారు కడ్డీలు ఉన్నాయి. 19వ శతాబ్దం నాటి ఓ పురాతన బీరు తయారీ కర్మాగారం నేలమాళిగ గోడలో దీనిని రహస్యంగా దాచి ఉంచారు.కానీ ఇంత పెద్ద నిధిని కనుగొన్నప్పటికీ, ఆ యువకుడు దానిని తనదిగా చెప్పుకోలేకపోతున్నాడు. అసలు ఈ నిధికి నిజమైన యజమాని ఎవరు?

డ్రైనేజీ కాలువ తవ్వకాల్లో బయటపడ్డ రూ. 99 కోట్ల బంగారు నిధి.. ఎగబడిన జనం..!
Belgium, Gold Treasure
Jyothi Gadda
|

Updated on: Nov 23, 2026 | 9:35 AM

Share

అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. సాధారణంగా రోజూవారీ కూలీ పనులకు వెళ్లిన ఓ యువకుడికి ఏకంగా కోట్ల రూపాయల విలువైన బంగారు నిధి కళ్లముందు ప్రత్యక్షమైంది. బెల్జియంలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

అసలేం జరిగింది?

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింట్-గిల్లిస్-డెండర్‌మొండే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఓ పురాతన భవనంలో మురుగునీటి పైపులైన్ల మార్పు, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. సెలవుల్లో భాగంగా తాత్కాలిక నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న 18 ఏళ్ల కోబే అనే విద్యార్థి తన సహచరులతో కలిసి తవ్వకాలు జరుపుతున్నాడు. ఈ క్రమంలో భవనం నేలమాళిగలోని ఓ గోడ వద్ద ఇటుకలతో మూసివేసిన రహస్య ప్రదేశంలో వారికి ఒక సంచి కనిపించింది.

నాణేలనుకుంటే బంగారు కడ్డీలు బయటపడ్డాయి!

తొలుత వాటిని సాధారణ ఒక యూరో నాణేలుగా కోబే భావించాడు. అయితే మరికొంత లోతుగా తవ్వి పరిశీలించగా, అక్కడ మెరుస్తున్న బంగారు ముక్కలు, అరుదైన బంగారు నాణేలతో పాటు నంబర్లు ముద్రించి ఉన్న సుమారు 50 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వీటి మొత్తం విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 98 నుండి 99 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

19వ శతాబ్దం నాటి చరిత్ర:

ఈ నిధి లభించిన భవనానికి గొప్ప చరిత్ర ఉంది. 19వ శతాబ్దం చివర్లో థియోఫిలస్ వాన్ అస్చే అనే సంపన్న బీరు తయారీ వ్యాపారి కోసం దీనిని నిర్మించారు. 1899 నుండి 1970 వరకు ఇక్కడ బీరు తయారీ కార్యకలాపాలు కొనసాగాయి. ప్రస్తుతం సామాజిక సంక్షేమ సంస్థ CAW ఊస్ట్-వ్లాండెర్న్ ఈ భవనాన్ని కార్యాలయాలు, నివాస సదుపాయాల కోసం ఆధునీకరిస్తోంది. ఎవరో కావాలనే ఈ బంగారాన్ని గోడలో ఇటుకలు కట్టి దాచిపెట్టినట్లు స్పష్టమవుతోంది.

నిధి ఎవరికి దక్కుతుంది?

ఇంత భారీ సంపద దొరికినప్పటికీ, కోబే,అతని సహచరులు నిజాయితీగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని బ్రస్సెల్స్‌లోని అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించారు. బెల్జియం చట్టాల ప్రకారం, దొరికిన నిధికి అసలు వారసులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవడానికి ఐదేళ్ల పాటు (2031 వరకు) వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరూ సరైన ఆధారాలు చూపకపోతే, నిబంధనల ప్రకారం ఆ నిధిని కనిపెట్టిన కార్మికుడికి, ప్రస్తుత భవన యజమానులకు పంచే అవకాశం ఉంది. ఏది ఏమైనా, తన నిజాయితీకి తగిన బహుమతి లభిస్తుందని ఆ 18 ఏళ్ల విద్యార్థి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us