AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూ బాక్సుల్లో వచ్చే సిలికా జెల్ ప్యాకెట్లను పారేస్తున్నారా? ఇంట్లో వాటి ఉపయోగాలు తెలిస్తే వదలరు!

మనం కొత్త షూలు, హ్యాండ్‌బ్యాగులు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కొన్నప్పుడు బాక్సులలో చిన్న తెల్లటి ప్యాకెట్లు కనిపిస్తాయి. వాటిపై డోంట్ ఈట్ అని రాసి ఉంటుంది. చాలామంది వీటిని చూసి పనికిరాని చెత్త అనుకుని వెంటనే పారేస్తుంటారు. కానీ నిజానికి ఈ సిలికా జెల్ ప్యాకెట్లు గాలిలోని అదనపు తేమను పీల్చుకుని వస్తువులు బూజు, తుప్పు పట్టకుండా కాపాడతాయి. షూ బాక్సుల్లో వీటిని ఉంచడానికి ప్రధాన కారణం తోలు, ఫ్యాబ్రిక్ తేమ వల్ల దెబ్బతినకుండా ఉండటమే. ఇంట్లో వీటిని ఎలా తిరిగి ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.

షూ బాక్సుల్లో వచ్చే సిలికా జెల్ ప్యాకెట్లను పారేస్తున్నారా? ఇంట్లో వాటి ఉపయోగాలు తెలిస్తే వదలరు!
Silica Gel Packets
Jyothi Gadda
|

Updated on: Nov 22, 2026 | 12:07 PM

Share

కొత్త షూ బాక్సులు, హ్యాండ్‌బ్యాగులు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు వాటిలో డోంట్ ఈట్ అని రాసి ఉన్న చిన్న సిలికా జెల్ ప్యాకెట్లు ఉంటాయి. మనం వీటిని పనికిరానివని చెత్తబుట్టలో పడేస్తుంటాం. కానీ, ఇవి గాలిలోని తేమను పీల్చుకుని వస్తువులను పాడవకుండా కాపాడుతాయి. అయితే వీటిని చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. కాబట్టి ఇకపై సిలికా జెల్ ప్యాకెట్లను పారేయకండి. ఇంట్లో వీటి ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం..

తడిచిన మొబైల్ ఫోన్‌ను కాపాడుకోవచ్చు

అనుకోకుండా మీ స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడినా లేదా వర్షంలో తడిసినా సిలికా జెల్ ప్యాకెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముందుగా ఫోన్ పైభాగంలోని నీటిని మెత్తని గుడ్డతో తుడిచి, ఆ తర్వాత కొన్ని సిలికా జెల్ ప్యాకెట్లతో కలిపి ఒక గాలి చొరబడని జిప్-లాక్ బ్యాగ్‌లో రాత్రంతా ఉంచితే లోపలి తేమను పూర్తిగా పీల్చుకుంటాయి.

షేవింగ్ రేజర్లు, పనిముట్లు తుప్పు పట్టకుండా..

బాత్రూమ్‌లో ఉండే తేమ వల్ల షేవింగ్ రేజర్ బ్లేడ్లు త్వరగా తుప్పు పట్టి మొద్దుబారిపోతాయి. ఒక చిన్న డబ్బాలో రేజర్‌తో పాటు ఒకటి రెండు సిలికా జెల్ ప్యాకెట్లు వేసి ఉంచితే బ్లేడ్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే ఇంటి టూల్‌బాక్స్‌లో స్క్రూలు, మేకులు, పనిముట్ల మధ్య వీటిని ఉంచితే తుప్పు పట్టకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వెండి నగలు, ఫోటో ఆల్బమ్‌ల రక్షణ

వాతావరణంలోని తేమ వల్ల వెండి వస్తువులు, నగలు నల్లబడతాయి. జ్యువెలరీ బాక్స్‌లో ఒక సిలికా జెల్ ప్యాకెట్ ఉంచితే నగలు తమ మెరుపును కోల్పోకుండా ఉంటాయి. అలాగే పాత ఫోటో ఆల్బమ్‌లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, పుస్తకాలు ఉంచే బాక్సులలో వీటిని పెడితే అవి అతుక్కోకుండా, చెమ్మ వాసన రాకుండా తాజాగా ఉంటాయి. కెమెరా లెన్సులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల బ్యాగుల్లోనూ వీటిని ఉంచితే ఫంగస్ చేరకుండా రక్షణ లభిస్తుంది.

బూట్లు, జిమ్ బ్యాగులు, బీరువాల్లో దుర్వాసనకు చెక్

చెమట పట్టిన షూలు లేదా జిమ్ బ్యాగుల్లో తేమ వల్ల దుర్వాసన, బ్యాక్టీరియా పెరుగుతాయి. షూ విప్పిన తర్వాత రాత్రిపూట అందులో సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచితే తేమను లాగేసి ఫ్రెష్‌గా ఉంచుతాయి.. బట్టల బీరువాలు, డ్రాయర్లలో ఉంచితే చెమ్మ వాసన రాకుండా ఉంటుంది. కారు డ్యాష్‌బోర్డ్‌పై ఉంచితే చలికాలంలో అద్దాలకు పొగమంచు పట్టడం తగ్గుతుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు

సిలికా జెల్ ప్యాకెట్లు తినడానికి పనికిరావు కాబట్టి చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు అందకుండా ఉంచాలి. అలాగే వీటిని మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేయకూడదు; ప్యాకెట్ చిరిగిపోతే వెంటనే పారేయాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంట్లో వృథాగా పడేసే సిలికా జెల్ ప్యాకెట్లను ఎంతో తెలివిగా వినియోగించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
షూ బాక్సుల్లో వచ్చే సిలికా జెల్ ప్యాకెట్లను పారేస్తున్నారా?
షూ బాక్సుల్లో వచ్చే సిలికా జెల్ ప్యాకెట్లను పారేస్తున్నారా?
నాకు తెలుగు నేర్పించింది.. పెళ్లి చేసింది ఆయనే: యాంకర్ సుమ
నాకు తెలుగు నేర్పించింది.. పెళ్లి చేసింది ఆయనే: యాంకర్ సుమ
మరోసారి పేలనున్న బంగారం బుడుగ.. తాజా లెక్కలివే..
మరోసారి పేలనున్న బంగారం బుడుగ.. తాజా లెక్కలివే..
చెవి నొప్పికి మందులు వాడుతున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి!
చెవి నొప్పికి మందులు వాడుతున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి!
ఐ ఫోన్‌ యూజర్లకు అలర్ట్.. ఛార్జింగ్ సేవ్ చేసే సూపర్ ట్రిక్స్ !
ఐ ఫోన్‌ యూజర్లకు అలర్ట్.. ఛార్జింగ్ సేవ్ చేసే సూపర్ ట్రిక్స్ !
శ్రీశాంత్, జహీర్ ఖాన్ సరసన బుమ్రా.. టెస్టుల్లో అరుదైన ఘనత
శ్రీశాంత్, జహీర్ ఖాన్ సరసన బుమ్రా.. టెస్టుల్లో అరుదైన ఘనత
మునక్కాయ పెసరపప్పు కూర ఇలా చేస్తే అన్నంలోకి కమ్మగా ఉంటుంది
మునక్కాయ పెసరపప్పు కూర ఇలా చేస్తే అన్నంలోకి కమ్మగా ఉంటుంది
హాస్పిటల్లో భార్య.. చేతిలో రూపాయి లేదు..
హాస్పిటల్లో భార్య.. చేతిలో రూపాయి లేదు..
రూ.10 వేల అప్పు తీర్చలేక స్నేహితులతో కలిసి యువకుడి హత్య..చివరకు
రూ.10 వేల అప్పు తీర్చలేక స్నేహితులతో కలిసి యువకుడి హత్య..చివరకు
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి  'దృశ్యం 3'.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి  'దృశ్యం 3'.. తెలుగులోనూ స్ట్రీమింగ్!