జుట్టు ఎక్కువగా రాలకుండా ఉండాలంటే ఈ చిట్కాలను మనం పాటించాలి. అప్పుడే జుట్టు రాలడం తగ్గుతుంది.
ఈ చిట్కాలను మనం పాటించాలి.
వీటిని పాటించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, జుట్టు రాలడం తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి
తలస్నానం చేయడానికి మూడు లేదా నాలుగు గంటల ముందు కొబ్బరి నూనె పెట్టుకుని, మృదువుగా మసాజ్ చేసుకోవాలి.
ఆ తర్వాత మూడు లేదా నాలుగు గంటలకు తలస్నానం చేయాలి.
టిప్ 1
ముందు రోజు రాత్రి నూనె పెట్టుకుని బయటకు వెళ్లడం వల్ల దుమ్ము, ధూళి జుట్టుకు అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తలస్నానానికి కొన్ని గంటల ముందు నూనె పెట్టుకోవడం మంచిది.
టిప్ 2
ఎక్కువ వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారి బలహీనంగా మారవచ్చు. కాబట్టి తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.
టిప్ 3
షాంపూను ఎప్పుడూ నేరుగా తలపై ఎక్కువగా పోసుకోకూడదు. ఒక మగ్గులో షాంపూ తీసుకుని, కొద్దిగా నీళ్లు కలిపిన తర్వాత తలకు పట్టించి తలస్నానం చేసుకోవాలి.
టిప్ 4
జుట్టును ఆరబెట్టడానికి ఎక్కువ వేడి వచ్చే హెయిర్ డ్రైయర్లను ఉపయోగించకూడదు. వాటి వేడి వల్ల జుట్టు పొడిబారి, గరుకుగా మారే అవకాశం ఉంటుంది.
టిప్ 5
కాబట్టి వీలైనంత వరకు సహజంగా ఎండకు లేదా గాలికి మాత్రమే జుట్టును ఆరబెట్టుకోవడానికి ప్రయత్నించాలి.