AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం ధరలు మరింత పతనం.. మరో పెద్ద బుడుగ పేలడం గ్యారంటీ.. అసలు లెక్కలివే..

బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలపై తన అంచనాలను ఎప్పుడూ వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు మరింత తగ్గుతాయని పరోక్షంగా తెలిపారు.

బంగారం ధరలు మరింత పతనం.. మరో పెద్ద బుడుగ పేలడం గ్యారంటీ.. అసలు లెక్కలివే..
Gold Prices Prediction
Venkatrao Lella
|

Updated on: Nov 22, 2026 | 11:53 AM

Share

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత నెలకొంది. బంగారం ధర దాదాపు 14 నెలల అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుని పతనం దిశగా వెళ్తున్నాయి. బంగారం కొనుగోలు చేసేవారికి ఇది భారీ ఉపశమనాన్ని కల్గిస్తుండగా.. సాధారణ పెట్టుబడిదారుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బంగారం ధరలు మరింత తగ్గుతాయనే అంచనాల క్రమంలో ఇప్పుడే బంగారం కొనాలా లేక మరికొంతకాలం వేచి ఉండాలా అనే సందిగ్ధంలో ఇన్వెస్టర్లు ఉన్నారు. కొంతమంది బంగారం ధరలు మరింతగా పడిపోతాయని విశ్లేషిస్తున్నారు. పసిడి కొనుగోలు చేసేందుకు ఇదే మంచి అవకాశంగా చెబుతున్నారు. మరికొన్ని సంస్థలు మాత్రం భవిష్యత్తులో ధరలు మరింతగా పెరుగుతాయని తమ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరుస్తున్నారు.

ఈ క్రమంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి ధరల పతనంపై స్పందించారు. బంగారం ధర మరింత పడిపోవచ్చని ఆయన పరోక్షంగా తెలిపారు. ” బంగారం ధరల పతనం మంచిదా చెడ్డదా? బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు కుప్పకూలుతున్నాయి. తరుణంలో బలహీనులు అమ్ముతున్నారు. బలవంతులు కొనడానికి వేచి చూస్తున్నారా? బిట్‌కాయిన్ పతనం గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. బిట్ కాయిన్ కొనుగోలు చేసేందుకు ఇంకా నేను వేచి చూస్తున్నాను. ఎందుకు? ఫెడ్, బ్యాంకులు, బాండ్ మార్కెట్లలోని అసమర్థత వంటి అనేక కారణాలు ఉన్నాయి. బ్యాంకర్లు తమ వ్యవస్థ ద్వారా చట్టబద్ధంగా మన సంపదను దోచుకుంటున్నందున అమెరికా అప్పు మరింత పెరగనుంది. అయినప్పటికీ మొత్తం 21 మిలియన్ల బిట్‌కాయిన్‌లు మాత్రమే ఉంటాయి. సుమారు 20 మిలియన్లు ఇప్పటికే మైనింగ్ చేయబడ్డాయి. నాకు తెలిసినంత వరకు బిట్‌కాయిన్ వంటి ‘డబ్బు’ ఇంతకు ముందెన్నడూ లేదు. 21వ బిట్‌కాయిన్ మైనింగ్ అయినప్పుడు ఏమి జరుగుతుందో అని నేను ఆశ్చర్యపోతున్నాను. బిట్‌కాయిన్ ధర పడిపోతున్న సందర్భంలో నేను మరిన్ని కాయిన్‌లను కొనడానికి ఆగలేకపోతున్నాను… ఎందుకంటే కేవలం 21 మిలియన్లు మాత్రమే మైనింగ్ చేయబడతాయి. అది ఒక ‘చిన్న విషయం’ కావచ్చు… లేదా నేను ఖర్చు చేసిన డబ్బులోకెల్లా ఉత్తమమైనది కావచ్చు. మీరేమనుకుంటున్నారు? జాగ్రత్త” అంటూ రాబర్ట్ కియోసా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి..?

అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు బంగారం ధరలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. త్వరలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తలు వస్తున్నాయి.  వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు మరింత పడిపోయే అవకాశాలుంటాయి. అమెరికా ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదే జరిగితే గోల్డ్ రేట్లు మరింత తగ్గవచ్చని అంటున్నారు.

Follow Us
మరోసారి పేలనున్న బంగారం బుడుగ.. తాజా లెక్కలివే..
మరోసారి పేలనున్న బంగారం బుడుగ.. తాజా లెక్కలివే..
చెవి నొప్పికి మందులు వాడుతున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి!
చెవి నొప్పికి మందులు వాడుతున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి!
ఐ ఫోన్‌ యూజర్లకు అలర్ట్.. ఛార్జింగ్ సేవ్ చేసే సూపర్ ట్రిక్స్ !
ఐ ఫోన్‌ యూజర్లకు అలర్ట్.. ఛార్జింగ్ సేవ్ చేసే సూపర్ ట్రిక్స్ !
శ్రీశాంత్, జహీర్ ఖాన్ సరసన బుమ్రా.. టెస్టుల్లో అరుదైన ఘనత
శ్రీశాంత్, జహీర్ ఖాన్ సరసన బుమ్రా.. టెస్టుల్లో అరుదైన ఘనత
మునక్కాయ పెసరపప్పు కూర ఇలా చేస్తే అన్నంలోకి కమ్మగా ఉంటుంది
మునక్కాయ పెసరపప్పు కూర ఇలా చేస్తే అన్నంలోకి కమ్మగా ఉంటుంది
హాస్పిటల్లో భార్య.. చేతిలో రూపాయి లేదు..
హాస్పిటల్లో భార్య.. చేతిలో రూపాయి లేదు..
రూ.10 వేల అప్పు తీర్చలేక స్నేహితులతో కలిసి యువకుడి హత్య..చివరకు
రూ.10 వేల అప్పు తీర్చలేక స్నేహితులతో కలిసి యువకుడి హత్య..చివరకు
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి  'దృశ్యం 3'.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి  'దృశ్యం 3'.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్లు.. పొంచి ఉన్న ముప్పు
బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్లు.. పొంచి ఉన్న ముప్పు
రోడ్లన్నీ వాహనాల కోసమేనా? నడిచే పాదచారుల ప్రాణాలకు భరోసా ఏదీ?
రోడ్లన్నీ వాహనాల కోసమేనా? నడిచే పాదచారుల ప్రాణాలకు భరోసా ఏదీ?