పెద్దపల్లిని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు
పెద్దపల్లి పట్టణాన్ని ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు తొలగకపోవడంతో పట్టణమంతా మంచు తెరలతో కనువిందు చేసింది. ఎటుచూసినా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
