AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండుమిర్చి పేస్ట్ చేసి కోడి మాంసం కూర చేస్తే ఎవరికైనా నచ్చాల్సిందే!

చికెన్ కర్రీని తినే వారికి, కొత్త రుచిని కోరుకునే వారికి ఉల్లిపాయ, ఎండుమిర్చి పేస్ట్ తో చేసే ఈ ప్రత్యేకమైన రెడ్ చిల్లీ చికెన్ కర్రీ ఒక మంచి అద్భుత రెసిపి, ఇది సాధారణ చికెన్ కర్రీ కంటే కొంచం వేరుగా ఇంకా చిక్కటి గ్రేవీతో కూడిన రుచిని అందిస్తుంది. అన్నం, చపాతీ, పూరీ, బగారా రైస్, ఘీ రైస్, జీరా రైస్ వంటి అనేక వంటకాలతో కలిపి తినడానికి ఇది చాలా బాగుంటుంది.

Prasanna Yadla
|

Updated on: Nov 22, 2026 | 7:21 AM

Share
ముందుగా ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి, తక్కువ నుండి మీడియం మంటపై బంగారు గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించండి. అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేయించినట్లుగా వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, టమాటా ముక్కలు, జీడిపప్పు, తుంచిన ఎండుమిర్చి,  రెడ్ చిల్లీస్ వేసి నిమిషం పాటు వేయించండి.

1 / 5
తరువాత కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి తక్కువ మంటపై బాగా మగ్గనివ్వండి. నీళ్లు ఇంకిపోయి, పదార్థాలన్నీ మృదువుగా అయ్యే వరకు ఉడికించాలి.  పదార్థాలన్నీ చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లోకి తీసుకుని, అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.అదే పాన్ లో మరికొద్దిగా  నూనె వేసి వేడి చేయండి. చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించండి. శుభ్రం చేసుకున్న చికెన్ ను వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయండి.

2 / 5
 మీడియం మంటపై కలుపుతూ వేయించండి.  చికెన్ లో నుండి నీరు ఊరి, అవి పూర్తిగా ఇంకిపోయి, నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. ఈ సమయంలోనే కరివేపాకు, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కలిపి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించడం ముఖ్యం. చికెన్ బాగా వేగిన తర్వాత, ముందుగా తయారుచేసుకున్న ఉల్లిపాయ-ఎండుమిర్చి పేస్ట్ ను వేయండి. తక్కువ మంటపై నిదానంగా కలుపుతూ, పేస్ట్ నుండి నూనె పైకి తేలేంత వరకు వేయించండి.

3 / 5
ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది, కానీ ఇది కూరకి మంచి రుచిని ఇస్తుంది.పేస్ట్ బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి తక్కువ మంటపై బాగా కలపండి. కారం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎండుమిర్చి పేస్ట్ లో సరిపడా కారం ఉంటుంది.

4 / 5
దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా కలపండి. ఒకసారి ఉప్పు, కారం, మసాలా సరిపోయాయో లేదో చూసుకోండి. సరిపోకపోతే సర్దుబాటు చేయండి. పాన్ కు మూత పెట్టి, చికెన్ మెత్తగా ఉడికే వరకు, గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి, ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని చేర్చి కలపండి. కసూరి మేతి కూరకి ప్రత్యేకమైన రుచిని, సువాసనను ఇస్తుంది. మళ్లీ మూత పెట్టి, నూనె పూర్తిగా పైకి తేలే వరకు తక్కువ మంటపై ఉడికించండి. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పలచగా ఉన్నా, చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయండి.

5 / 5
Follow Us