AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

ఏపీకి అక్వాన్ తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ వర్షాల ముప్పు పొంచి ఉంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather Alert
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2026 | 6:33 AM

Share

ఏపీకి అక్వాన్ తుఫాన్ ముప్పు తప్పింది. ఈ క్రమంలోనే.. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్’ (Akvan) తీవ్ర తుఫాను తీరం దాటిన అనంతరం బలహీనపడి ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతోందని.. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణం మార్పులు చోటుచేసుకోనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర అంతర్గత ఒడిశాపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఉత్తర ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపైకి విస్తరించినది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ – నైరుతి గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:-

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40నుండి 50కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40నుండి 50కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..

ఇదిలాఉంటే, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో రాత్రిపూట, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. మున్ముందు ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Follow Us