AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. విమాన క్యాబిన్‌లో ఇరుముడికి మరోసారి అనుమతి!

Sabarimala Ayyappa Devotees Irumudi In Flight: శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. విమాన ప్రయాణంలో పవిత్రమైన ఇరుముడిని క్యాబిన్‌లో తమ వెంట తీసుకెళ్లేందుకు వరుసగా మూడో ఏడాది కూడా అనుమతి కొనసాగుతోంది. భక్తుల సౌకర్యార్థం BCAS, CISF సహా సంబంధిత అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. విమాన క్యాబిన్‌లో ఇరుముడికి మరోసారి అనుమతి!
Sabarimala Ayyappa Devotees Irumudi In Flight
Rajashekher G
|

Updated on: Nov 21, 2026 | 10:23 PM

Share

Sabarimala Ayyappa Temple: అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు విమాన ప్రయాణంలో మరోసారి ఊరట లభించింది. పవిత్రమైన ఇరుముడిని విమాన క్యాబిన్‌లో తమ వెంట తీసుకెళ్లేందుకు వరుసగా మూడో ఏడాది కూడా అనుమతి కొనసాగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాధారణంగా విమాన ప్రయాణాల్లో భద్రతా నిబంధనల కారణంగా కొన్ని వస్తువులను క్యాబిన్‌లోకి అనుమతించరు. అయితే అయ్యప్ప భక్తుల ఆచారాలు, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఇరుముడి విషయంలో ప్రత్యేక వెసులుబాటు కల్పించారు.

భక్తుల పవిత్ర యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), విమానాశ్రయ నిర్వాహకులతో పాటు ఇతర సంబంధిత విభాగాలకు అవసరమైన సూచనలు జారీ చేశారు. దీంతో విమానాల్లో ప్రయాణించే అయ్యప్ప భక్తులు తమ ఇరుముడిని క్యాబిన్‌లోనే తీసుకెళ్లే అవకాశం కొనసాగనుంది. ఇది శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులకు ఆనందం కలిగించే విషయంగా చెప్పవచ్చు.

శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి చేసిన కేరళ పోలీసులు

విజయవాడ: శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్‌ను తప్పనిసరి చేశారు. రద్దీని నియంత్రించి, సురక్షిత యాత్ర కోసం రోజుకు గరిష్టంగా 80,000 మంది భక్తులకే అనుమతి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

స్పాట్ బుకింగ్‌ను పంపా నుంచి నిలక్కల్‌కు మార్చారు; అక్కడ రోజుకు 10,000 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అటవీ మార్గాల్లో వెళ్లే వారికి కూడా బుకింగ్ తప్పనిసరి (స్పాట్ బుకింగ్ రోజుకు 2,000 మందికే పరిమితం). ప్రైవేట్ వాహనాలను నిలక్కల్ వద్దే నిలిపి, కేఎస్ఆర్టీసీ బస్సుల్లో పంపాకు వెళ్లాలి. అంతేగాక, పంపా నదిలో వస్త్రాలు వేయడం నిషేధం విధించారు.

Follow Us