ఆ రూమర్స్ నన్ను చాలా బాధించాయి.. నాకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..
Rajitha Chanti
Pic credit - Instagram
21 November 2026
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా తనదైన ప్రత్యేకత చాటుకున్న నటి కీర్తి సురేశ్ తన వ్యక్తిగత జీవితం, ప్రేమ బంధాలపై వస్తున్న పుకార్లపై స్పష్టతనిచ్చారు.
సినిమాల్లో బిజీగా ఉండే తారల గురించి రకరకాల రూమర్లు రావడం సహజమే అయినప్పటికీ, తన ప్రేమ ప్రయాణం ఎప్పుడూ ఒకే వ్యక్తితో సాగిందని ఆమె వెల్లడించారు.
తన భర్త ఆంటోనీతోనే తాను ఎల్లప్పుడూ ప్రేమలో ఉన్నానని కీర్తి సురేశ్ పేర్కొన్నారు. గతంలో తన గురించి పలు రకాల వదంతులు వినిపించాయని అన్నారు.
వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తన మనసులో, జీవితంలో ఆంటోనీకే ప్రత్యేక స్థానం ఉందని, తమ బంధంపై ఆమె క్లారిటీ ఇచ్చారు.
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో, వార్తల్లో ఊహాగానాలు రావడం కొత్తేమీ కాదని, అయితే వాస్తవాలను స్పష్టంగా చెప్పడం ముఖ్యమని అన్నారు.
ఆంటోనీ తట్టిల్‌తో ఉన్న అనుబంధం గురించి కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో, అటు నెట్టింట ఆసక్తికరంగా మారి ఆకట్టుకుంటున్నాయి.
కెరీర్ పరంగా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న కీర్తి సురేశ్, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో సంతోషంగా, స్పష్టతతో ముందుకు సాగుతున్నారు.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతున్న కీర్తి ఇప్పుడు హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు.