రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఆదాయం… PF డబ్బు వాయిదాల్లో తీసుకునే ఛాన్స్!

×

రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఆదాయం… PF డబ్బు వాయిదాల్లో తీసుకునే ఛాన్స్!

సాధారణంగా, పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల భవిష్య నిధి (PF) డబ్బు మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ విధానంలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) SWP (సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్) పేరుతో ఒక కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ నూతన విధానం వల్ల పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును ఒకేసారి కాకుండా, తమ అవసరాన్ని బట్టి నెలవారీగా, మూడు నెలలకొకసారి లేదా ఏడాదికొకసారి వాయిదాల్లో విత్‌డ్రా చేసుకునే వీలు కల్పిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా కొంత డబ్బును విత్‌డ్రా చేసుకున్నప్పటికీ, ఖాతాలో మిగిలిన పీఎఫ్ నిధిపై యథావిధిగా వడ్డీ వస్తూనే ఉంటుంది. అంతేకాదు, ఉద్యోగులు అసలు డబ్బును అలాగే ఉంచి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది పూర్తిగా వినియోగదారుల ఇష్టంతో పనిచేసే ఆప్షన్ కాబట్టి, ఎప్పుడైనా దీనిని నిలిపివేసి, మిగిలిన పూర్తి మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ EPFO SWP ఆప్షన్ పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను, స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని కోరుకునే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Phani CH