AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారా..? బ్యాంకుల నుంచి బిగ్ అప్డేట్ ఇదే..

ప్రతీ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు అనేది తప్పనిసరి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లేకుండా వంటింట్లో ఎలాంటి పని జరగదు. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర నిబంధనల విధించింది. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు.

ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారా..? బ్యాంకుల నుంచి బిగ్ అప్డేట్ ఇదే..
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Nov 21, 2026 | 9:27 PM

Share

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్ జారీ చేశాయి బ్యాంకులు. మీరు ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్‌లలో ఏ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. లేకపోతే బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ము కోల్పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లకు కేవైసీని తప్పనిసరి చేశాయి. గృహ కనెక్షన్లు వాడేవారు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. కమర్షిల్ సిలిండర్లకు వాడేవారికి ఇది తప్పనిసరి కాదు. డొమెస్టిక్ సిలిండర్లు వాడేవారు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయకపోతే సబ్సిడీ ధరలకు సిలిండర్ సరఫరా నిలిచిపోతుందని, మార్కెట్ ధరలకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే గ్యాస్ కేవైసీ, సబ్సిడీ పేరుతో సైబర్ నేరగాళ్లు స్పామ్ లింకులు పంపించి వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నాయి. ఇలాంటి నకిలీ లింకుల ద్వారా ఫోన్లలోకి ప్రమాదకర మాల్‌వేర్లను పంపించి బ్యాంక్ వివరాలు తెలుసుకుంటారు. ఈ వివరాల ద్వారా బ్యాంక్ అకౌంట్లలోని సొమ్మును కొల్లగొడుతున్నారు. దీంతో గ్యాస్ కేవైసీ, సబ్సిడీ పేరుతో వచ్చే నకిలీ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐసీఐసీఐ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు తమ కస్టమర్లను హెచ్చరించాయి. ఇలాంటి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కామ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగులు, ఆయిల్ కంపెనీల అధికారులు, ప్రభుత్వ ప్రతినిధుల తరహాలోనే నటించి వినియోగదారులను మోసం చేస్తున్నారు.

తక్షణమే తాము పంపిన లింకుల ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే గ్యాస్ కనెక్షన్ తొలగిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో పాటు విద్యుత్, నీటి సరఫరా కూడా ఆగిపోతుందంటూ మెస్సేజ్‌లు పంపిస్తున్నారు. తాము పంపిన లింకుల ద్వారా ఆధార్‌తో సబ్సిడీని అనుసంధానం చేసేందుకు ఒక ఫారంను నింపాలని కోరుతున్నారు. అలాగే సబ్సిడీ సొమ్ము పంపాలంటే రిజిస్ట్రేషన్ ఫీజుగా కొంతమొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నకిలీ కస్టమర్ హెల్ప్ లైన్ నెంబర్ల ఆధారంగా వినియోగదారుల ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇక హానికరమైన ఏపీకే ఫైల్ పంపి డౌన్ లోడ్ చేసుకోమని చెబుతున్నారు. వాటిని డౌన్ లోడ్ చేసుకోగానే ఫోన్ హ్యాక్ చేయడంతో పాట్ బ్యాంక్ ఓటీపీలు తెలుసుకుంటున్నారు. దీంతో వాట్సప్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ కేవైసీ పేరుతో వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేయవద్దని బ్యాంకులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ కంపెనీల అధికారిక పోర్టల్స్ లేదా యాప్‌ల ద్వారా మాత్రమే కేవైసీ అప్డేట్ చేసుకోవడం లేదా సబ్సిడీ పొందేందుకు బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నాయి.

Follow Us
ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా..? కీలక అప్డేట్.
ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా..? కీలక అప్డేట్.
కార్తీక పౌర్ణమి.. ఈ ఐదు పనులు తప్పక చేయండి.. శివకేశవుల అనుగ్రహం..
కార్తీక పౌర్ణమి.. ఈ ఐదు పనులు తప్పక చేయండి.. శివకేశవుల అనుగ్రహం..
ఆ హీరోతో ఓ సీన్‏లో స్విమ్‌సూట్‌లో కనిపించా..
ఆ హీరోతో ఓ సీన్‏లో స్విమ్‌సూట్‌లో కనిపించా..
ఎన్టీఆర్ సినిమా చూసి మహేష్ బాబు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
ఎన్టీఆర్ సినిమా చూసి మహేష్ బాబు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
రాజకీయ భవిష్యత్ కోల్పోతారు.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ
రాజకీయ భవిష్యత్ కోల్పోతారు.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
కార్తీక పౌర్ణమి రోజు చంద్రునికి నైవేద్యంగా పెట్టె పచ్చి చలిమిడి
కార్తీక పౌర్ణమి రోజు చంద్రునికి నైవేద్యంగా పెట్టె పచ్చి చలిమిడి
సౌందర్యను చూశాకే ఆ అలవాటు నేర్చుకున్నా.. హీరోయిన్ ఆమని..
సౌందర్యను చూశాకే ఆ అలవాటు నేర్చుకున్నా.. హీరోయిన్ ఆమని..
కేవలం రూ.12కే బంగారం.. సిల్వర్ రూ.15కే. జాక్‌పాట్ ఛాన్స్..
కేవలం రూ.12కే బంగారం.. సిల్వర్ రూ.15కే. జాక్‌పాట్ ఛాన్స్..
యువతను నాశనం చేస్తున్న విదేశీ శక్తులుః కిషన్‌రెడ్డి
యువతను నాశనం చేస్తున్న విదేశీ శక్తులుః కిషన్‌రెడ్డి