AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణకు నమో భారత్ ర్యాపిడ్ రైలు..! ఈ రూట్లోనే జర్నీ.. కేవలం మూడున్నర గంటల్లోనే..

తెలంగాణలో నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. సికింద్రాబాద్-కరీంనగర్ మధ్య దీనిని తీసుకురావాలని ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లాలంటే సరైన రైలు సౌకర్యం అందుబాటులో లేదు. నమో భారత్ ర్యాపిడ్ రైలు వస్తే మూడున్నర గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

Telangana: తెలంగాణకు నమో భారత్ ర్యాపిడ్ రైలు..! ఈ రూట్లోనే జర్నీ.. కేవలం మూడున్నర గంటల్లోనే..
Namo Bharat Rapid Rail
Venkatrao Lella
|

Updated on: Nov 21, 2026 | 6:38 PM

Share

తెలంగాణలో ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుండగా.. రాబోయే రోజుల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కించే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్‌లో భాగంగా హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణెకు బుల్లెట్ రైళ్లు నడిపే ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. అయితే ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త అందించేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఉత్తర తెలంగాణ ప్రజల ప్రయాణ కష్టాలు తీర్చేందుకు నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ లేదా మెము రైలు నడిపేందుకు ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి, కాజీపేట మీదుగా కరీంనగర్‌కు ఈ రైలు తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీని వల్ల హైదరాబాద్‌లో నివసించే ఉత్తర తెలంగాణ ప్రజలు సులువుగా తమ ప్రాంతాలకు చేరుకునే అవకాశం లభిస్తుంది.

ప్రస్తుతం కరీంనగర్-కాచిగూడ మధ్య డెమూ ప్యాసింజర్ ట్రైన్ నడుస్తోంది. ఇది జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్ మీదుగా 309 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ చుట్టూ తిరుగుకుంటూ వస్తోంది. నిజామాబాద్-మేడ్చల్ మధ్య సింగిల్ ట్రాక్ మాత్రమే ఉండటంతో గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది. దీని వల్ల రైళ్ల రాకపోకలకు 9 గంటల మధ్య సమయం పడుతుంది. కేవలం నాలుగు గంటల జర్నీ సమయానికి 9 గంటలు పడుతుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు నిరంతరం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. ప్రతీ ఐదు నిమిషాలకు ఒక్క బస్సు ఉంటుంది. వీటిల్లో జర్నీకి నాలుగు గంటలు మాత్రమే పడుతుంది. కనీస టికెట్ ధర రూ.220గా ఉండగా.. లగ్జరీ బస్సుల్లో మరింత ఎక్కువగా ఉంది.

అయితే సరైన రైలు ప్రయాణ సౌకర్యం ఈ మార్గంలో అందుబాటులో లేదు. దీంతో నమో ర్యాపిడ్ రైలు తీసుకురావాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇది అందుబాటులోకి వస్తే కేవలం మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల్లోనే సికింద్రాబాద్-కరీంనగర్ మధ్య ప్రయాణించవచ్చు. ప్రస్తుతం పెద్దపల్లి-కాజీపేట మధ్య మూడో రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. కాజీపేట నుంచి ఘట్ కేసర్ వరకు రెండో లైన్, ఘట్ కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు నాలుగో లైన్ ఉంది. కరీంనగర్-పెద్దపల్లి మధ్య సింగిల్ లైన్ ఉంది. ఈ లైన్లో గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైళ్లను తిప్పవచ్చు. దీంతో నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రవేశపెడితే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడనుంది. ఉప్పల్, చర్లపల్లి,ఘట్ కేసర్, మౌలాలి,సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో నివసించే ఉత్తర తెలంగాణ ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుది. నమో భారత్ ర్యాపిడ్ రైలు అందుబాటులోకి వస్తే తక్కువ ధరతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు.

Follow Us