కిసాన్ వికాస్ పత్ర ఖాతాదారులకు పెద్ద అలర్ట్.. 30 నెలల తర్వాత డబ్బులు విత్ డ్రా.. కొత్త రూల్స్..
పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఇందులో లక్షలాది మంది పెట్టుబడులు పెట్టుడుతున్నారు. పోస్టాఫీసుల్లో ఉన్న పథకాలన్నింటిల్లోనూ ఇది అత్యంత పాపులర్ అయిన స్కీమ్‌గా చెప్పవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది.

పోస్టాఫీసుల్లో అనేక పొదుపు పథకాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. తమ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు ఎలాంటి రిస్క్ లేని స్థిరమైన ఆదాయం లభిస్తుందనే కారణంతో ఎక్కువమంది ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొస్తున్నారు. అలాంటివాటిల్లో బాగా పాపులర్ అయిన స్కీమ్ పోస్టాఫీస్ విసాన్ వికాస్ మిత్ర. ఈ పథకంలో ప్రస్తుం వడ్డీ రేట్లు ఏకంగా 7.5 శాతంగా ఉంది. మీరు పెట్టే డబ్బులు 9 ఏళ్ల 7 నెలల్లో రెట్టింపు అవుతాయి. అయితే ఈ ఖాతాలో డబ్బులు పొదుపు చేసుకుంటే ఏదైనా అత్యవసరమైనప్పుడు మెచ్యూరిటీ కంటే ముందే విత్ డ్రా చేసుకోవచ్చా..? లేదా? అనేది ఇందులో చూద్దాం.
ఈ గడువు తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు..
పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్రలో ఖాతా ఉన్నవారు మెచ్యూరిటీకి ముందే తమ ఆర్ధిక అవసరాల కోసం డబ్బులను ఉపసంహరించుకోవచ్చు. అయితే 2 సంవత్సరాల 6 నెలల గుడువు పూర్తి చేసి ఉండాలి. అంటే 30 నెలల తర్వాత తీసుకోవచ్చన్నమాట. ఇందుకు ఎలాంటి ప్రత్యేక పెనాల్టీలు లేదా విత్ డ్రా ఛార్జీలు అనేవి ఉండవు. కానీ మీరు నగదు మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండదు. ఈ సమయంలో మీరు తక్కువ రాబడి పొందుతారు. ఉదాహరణకు మీరు రూ.వెయ్యి పెట్టుబడి పెడితే రెండేళ్ల 6 నెలల తర్వాత రూ.1157 రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రూ.157 రాబడి పొందినట్లు. అయితే మెచ్యూరిటీ వరకు డబ్బులు ఉంచితే రూ.2 వేల వరకు పొందవచ్చు. కానీ ముందే తీసుకుంటే తక్కువ సొమ్ము అందుతాయి.
నిబంధనలు ఉంటి..?
30 నెలల్లోపు ఖాతాను మూసివేయడానికి అనుమతి లేదు. 30 నెలల తర్వాత మూసివేయచ్చు. కానీ తక్కువ రాబడి అందుతుంది. అయితే ఖాతాదారుడు మరణించడం, ప్రభుత్వం ఖాతాను జప్తు చేయడం, కోర్టు ఉత్తర్వులు వంటి సమయంలో ఖాతాను ముందే మూసివేయవచ్చు. కానీ ఇందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర విషయానికొస్తే.. రూ.వెయ్యితో పెట్టుబడులు స్టార్ట్ చేయవచ్చు. ఇక గరిష్టంగా మీరు ఎంత అయినా జమ చేయవచ్చు. అయితే ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. ప్రస్తుతం 7.5 శాతంగా వడ్డీ రేటు ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను మారుస్తుంది. దీంతో భవిష్యత్తులో వడ్డీ రేట్లు అనేవి పెరగవచ్చు. వడ్డీ రేట్లు పెరిగితే ఆదాయం మరింతగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలి. అయితే ఈ ఖాతాలోని పెట్టుబడులకు ఎలాంటి రిస్క్ ఉండదు. స్టాక్ మార్కెట్ల కదలికలతో సంబంధం ఉండదు. దీంతో మెచ్యూరిటీ తర్వాత స్ధిరమైన ఆదాయం మీకు లభిస్తుంది.
