AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagavad Gita: మనిషిలోని ఈ 3 భావోద్వేగాలే ప్రశాంతతకు అడ్డంకులు.. శ్రీకృష్ణుడు చెప్పిన పరిష్కారమిదే!

Bhagavad Gita Teachings Telugu: భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డంకిగా మారే మూడు భావోద్వేగాల గురించి వివరించారు. మమకారం, భయం, కోపం నుంచి బయటపడి మనశ్శాంతిని ఎలా పొందవచ్చో భగవత్ గీతా బోధనల ద్వారా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Nov 21, 2026 | 4:43 PM

Share
Bhagavad Gita Telugu: భగవద్గీతలోని 4వ అధ్యాయం, 10వ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనిషి తనలోని ప్రాపంచిక భావోద్వేగాల నుంచి బయటపడి, దైవిక భావనలను ఎలా అలవర్చుకోవాలో వివరించారు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రధానంగా మూడు అడ్డంకులు ఉంటాయని ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. అవే రాగం (వ్యామోహం లేదా మమకారం), భయం, క్రోధం (కోపం). సాధారణంగా మనిషి జీవితంలో ఏదో ఒకదానిపై ఆశలు, కోరికలు కలిగి ఉంటాడు. మంచి ఉద్యోగం రావాలని, ఎక్కువ డబ్బు సంపాదించాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అనుకున్నది జరగనప్పుడు నిరాశ, అసంతృప్తి కలుగుతాయి. అదే పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే భయం, ఆందోళన మొదలవుతాయి. ఇతరులు తమను బాధపెట్టినా, అనుకున్న విధంగా పనులు జరగకపోయినా కోపం వస్తుంది. ఇలా కోరికలు, భయాలు, కోపాలు మనసును నిరంతరం కలవరపెడుతుంటాయి.

1 / 5

1. మమకారాన్ని తగ్గించుకోవడం: మనకు నచ్చిన వస్తువులు, సంపద, హోదా, సంబంధాలపై ఎక్కువ మమకారం పెంచుకుంటాం. అవి దూరమవుతాయనే ఆలోచన కూడా మనల్ని బాధిస్తుంది. అయితే భౌతిక ప్రపంచంలోని సుఖాలన్నీ తాత్కాలికమైనవని గుర్తించాలి. మంచి ఉద్యోగం, సంపద, ఆరోగ్యం వంటి అవసరాలు ముఖ్యమే. కానీ వాటన్నింటికంటే పరమాత్ముడైన శ్రీకృష్ణుడే అత్యున్నత లక్ష్యమని అర్థం చేసుకోవాలి. చిన్న కోరికల కంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అనవసరమైన వ్యామోహాల నుంచి మనసును మళ్లించుకోవచ్చు.

2 / 5

2. భయాన్ని అధిగమించడం: భవిష్యత్తులో ఏం జరుగుతుందోననే ఆందోళన, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు మనిషిలో భయాన్ని కలిగిస్తాయి. అయితే ప్రతి సమస్యను మనం ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదని భగవంతుడిపై విశ్వాసం ఉంచాలి. శ్రీకృష్ణుడిని స్మరిస్తూ, ఆయనపై నమ్మకంతో ముందుకు సాగితే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం లభిస్తాయని గీతా బోధన సూచిస్తుంది.

3 / 5

3. కోపాన్ని నియంత్రించుకోవడం: ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు లేదా అన్యాయం చేసినప్పుడు కోపం రావడం సహజం. అయితే జరిగిన సంఘటనను పదేపదే గుర్తుచేసుకుంటూ బాధపడటం వల్ల మనశ్శాంతి దూరమవుతుంది. జరిగిపోయిన విషయాన్ని మార్చలేమనే వాస్తవాన్ని అంగీకరించాలి. అంగీకరించడం అంటే అన్యాయాన్ని సమర్థించడం కాదు. మనసులోని పగ, ద్వేషాలను తగ్గించుకుని, పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. శ్రీకృష్ణుడిపై విశ్వాసం ఉంచడం ద్వారా కష్టాలను ఎదుర్కొనే అంతర్గత బలాన్ని పొందవచ్చు.

4 / 5
ఆధ్యాత్మిక భావనల వైపు ప్రయాణం: మనసులోని మమకారం, భయం, కోపం వంటి భావోద్వేగాల ప్రభావం తగ్గినప్పుడు దైవచింతనకు ఎక్కువ అవకాశం లభిస్తుంది. జ్ఞానం, వివేకం, ఆత్మనిగ్రహం ద్వారా మనసును శుద్ధి చేసుకోవడాన్నే ఇక్కడ జ్ఞాన తపస్సుగా భావించవచ్చు. గతంలో ఎంతోమంది ఈ విధంగా జ్ఞానంతో తమను తాము శుద్ధి చేసుకుని దైవిక ప్రేమను పొందారని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. అందుకే ప్రాపంచిక భావోద్వేగాలకు బానిసలుగా మారకుండా, మనసును శ్రీకృష్ణుడిపై నిలిపి, ఆయనను శరణు వేడుకోవాలని భగవద్గీత బోధిస్తోంది. ఇలా భౌతిక భావనల నుంచి దైవిక భావనల వైపు ప్రయాణించినప్పుడు మనిషికి నిజమైన ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం లభిస్తాయి. 
(Disclaimer: ఈ వ్యాసంలోని విషయాలు భగవద్గీతలోని ఆధ్యాత్మిక బోధనలు, మత విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. పాఠకులకు ఆధ్యాత్మిక అవగాహన కల్పించడం మాత్రమే మా ఉద్దేశం.)

ఆధ్యాత్మిక భావనల వైపు ప్రయాణం: మనసులోని మమకారం, భయం, కోపం వంటి భావోద్వేగాల ప్రభావం తగ్గినప్పుడు దైవచింతనకు ఎక్కువ అవకాశం లభిస్తుంది. జ్ఞానం, వివేకం, ఆత్మనిగ్రహం ద్వారా మనసును శుద్ధి చేసుకోవడాన్నే ఇక్కడ జ్ఞాన తపస్సుగా భావించవచ్చు. గతంలో ఎంతోమంది ఈ విధంగా జ్ఞానంతో తమను తాము శుద్ధి చేసుకుని దైవిక ప్రేమను పొందారని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. అందుకే ప్రాపంచిక భావోద్వేగాలకు బానిసలుగా మారకుండా, మనసును శ్రీకృష్ణుడిపై నిలిపి, ఆయనను శరణు వేడుకోవాలని భగవద్గీత బోధిస్తోంది. ఇలా భౌతిక భావనల నుంచి దైవిక భావనల వైపు ప్రయాణించినప్పుడు మనిషికి నిజమైన ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం లభిస్తాయి. (Disclaimer: ఈ వ్యాసంలోని విషయాలు భగవద్గీతలోని ఆధ్యాత్మిక బోధనలు, మత విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. పాఠకులకు ఆధ్యాత్మిక అవగాహన కల్పించడం మాత్రమే మా ఉద్దేశం.)

5 / 5
Follow Us
మనిషిలోని ఈ 3 భావోద్వేగాలే ప్రశాంతతకు అడ్డంకులు.. శ్రీకృష్ణుడు..

గోల్డ్, వెండి కాదు.. ఒకేసారి కుప్పకూలిన ఎర్ర బంగారం..

కారంగా అదిరిపోయే రుచితో నెల రోజులు నిల్వ ఉండే ఉల్లిపాయ పచ్చి కారం

వంటింట్లోని ఈ రెండు కలిపి వేస్తే.. కనకాంబరం పూలు విరగబూస్తాయి

ఓటీపీ రాకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ..
ఓటీపీ రాకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ..
ఈ సినిమాల్లో హీరోల కన్నా విలన్లే తోపు.. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్

ఇది తెలియక ఇన్నాళ్లూ గోంగూర పచ్చడి రుచిని మిస్ అయ్యారు

ఆ విషయంలో బాలకృష్ణ అస్సలు తగ్గలేదు.. అంత పట్టుబడతారని అనుకోలేదు..

ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. వరుసగా నాలుగు కార్లు ఢీ!

తలుపులు మూసిన ఇంటి నుంచి ఒక్కటే దుర్వాసన.. తీరా చూస్తే!