ప్రతిరోజూ గ్రీన్ ఆపిల్ తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, మెదడు పనితీరు చురుకుగా ఉండి వయసుతో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుది.
గ్రీన్ ఆపిల్లో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షించి అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గ్రీన్ ఆపిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ వేగంగా సాగి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమై పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
రోజూ గ్రీన్ ఆపిల్స్ తినడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు బాగుంటుందని, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తగ్గి శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడి ఆహారం నుంచి పోషకాలను శరీరం సమర్థవంతంగా గ్రహించడంలో తోడ్పడుతుంది.
గ్రీన్ ఆపిల్ శరీరానికి అవసరమైన సహజ శక్తిని అందించి రోజంతా చురుకుగా ఉండేందుకు సహాయపడుతుందని, తక్కువ కేలరీలు, ఫైబర్ కారణంగా బరువు నియంత్రణకూ ఉపయోగపడుతుంది.
శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు సమతుల ఆహారంతో పాటు గ్రీన్ ఆపిల్ను చేర్చుకోవడం మంచిదని, దీనివల్ల కడుపు నిండిన భావన కలిగి అనవసరమైన చిరుతిళ్ల అలవాటు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణ ఆపిల్ తరహాలోనే గ్రీన్ ఆపిల్లోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సమగ్ర ఆరోగ్యం కోసం దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.