వాస్తు శాస్త్రం ప్రకారం, మందార మొక్క కేవలం ఒక అందమైన పూల మొక్క మాత్రమే కాదు, ఇది ఇంటికి సానుకూల శక్తిని తీసుకువచ్చే ఒక శక్తివంతమైన సాధనం. మందార పూలు ముఖ్యంగా గణపతికి, దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైనవి.
మందార పూలు మనకు పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను పెంచడం వల్ల అనేక ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
జాతకంలో సూర్య భగవానుని అనుగ్రహం తక్కువగా ఉన్నవారు లేదా సూర్య దోషంతో బాధపడేవారు ఇంటి ఆవరణలో మందార మొక్కను పెంచడం శ్రేయస్కరం అంటున్నారు వాస్తు నిపుణులు.
ఎరుపు రంగు మందార పూలు అంగారక గ్రహం (Mars) యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించి, ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో సహాయపడతాయి.
ఎరుపు మందార పూలు సూర్యుడికి చిహ్నంగా భావిస్తారు. వీటిని దేవతలకు సమర్పించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
మందార మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దక్షిణ దిశలో ఈ మొక్కను ఉంచడం అంత మంచిది కాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
విద్యార్థులు చదువుకునే గది కిటికీ దగ్గర లేదా ఇంటి ఈశాన్య మూలలో మందార మొక్క ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని నమ్ముతారు. ఇది ప్రతికూల ఆలోచనలను దూరం చేసి మెదడును చురుగ్గా ఉంచుతుంది.
మందార మొక్క కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, చర్మ, జుట్టు సంరక్షణలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వాస్తు నియమాలను పాటిస్తూ ఈ మొక్కను పెంచితే అందంతో పాటు ఆరోగ్యం, అదృష్టం మీ సొంతమవుతాయి.