ఫిష్‌ కాదు క్రిల్‌ ఆయిల్‌తో కిర్రాక్‌ బెనిఫిట్స్‌ !

14 April 2026

Jyothi Gadda

క్రిల్ ఆయిల్ అంటే ఏమిటి?: అంటార్కిటికా సముద్ర తీరంలో ఉండే చిన్న చిన్న రొయ్యల వంటి జీవుల నుండి ఈ నూనెను తీస్తారు. వీటిని క్రిల్ అని పిలుస్తారు. సముద్రంలోని పెద్ద చేపలకు ఇవే ప్రధాన ఆహారం.

ఫిష్ ఆయిల్‌లోని ఒమేగా-3 ట్రైగ్లిజరైడ్ రూపంలో ఉంటుంది. కానీ క్రిల్ ఆయిల్‌లో ఇది ఫాస్ఫోలిపిడ్ రూపంలో ఉంటుంది. దీనివల్ల మన రక్తంలోకి ఇది చాలా త్వరగా, సులభంగా కలిసిపోతుంది.

యాంటీ ఆక్సిడెంట్ పవర్: క్రిల్ ఆయిల్‌కు ఎరుపు రంగునిచ్చే అస్టాక్సాంతిన్ అనే పదార్థం ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది.

గుండె, కీళ్ల ఆరోగ్యం: ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

మెదడు పనితీరు: ఒమేగా-3 పుష్కలంగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి పెరగడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది.

క్రిల్ ఆయిల్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సీ ఫుడ్ అలర్జీ ఉన్నవారు దీనిని వాడకూడదు. అలాగే, రక్తాన్ని పలచబరిచే మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరగబోయే వారు డాక్టరును సంప్రదించడం తప్పనిసరి.

మీరు ఒమేగా-3 సప్లిమెంట్ తీసుకోవాలని అనుకుంటే, ఫిష్ ఆయిల్‌తో పోలిస్తే క్రిల్ ఆయిల్ ఒక నాణ్యమైన ఎంపిక. అయితే, ఏ సప్లిమెంట్ అయినా మీ శరీర తత్వానికి అది సరిపోతుందో లేదో డాక్టర్‌ సలహా తప్పనిసరి. 

ఫిష్ ఆయిల్, దానిలోని యాసిడ్లను ఆరోగ్య సప్లిమెంట్‌గా విరివిగా తీసుకుంటున్నప్పటికీ, పరిశోధకులు, వినియోగదారులు ఇద్దరూ ఇప్పుడు క్రిల్ ఆయిల్ వైపు మళ్లుతున్నారు.