శరీరానికి చలవ: ఇది సహజ సిద్ధమైన కూలెంట్‌గా పనిచేసి, ఎండ వేడి నుండి శరీరానికి తక్షణ ఉపశమనాన్ని, చల్లదనాన్ని అందిస్తుంది. వడదెబ్బ తగలకుండా రక్షణనిస్తుంది.
డీహైడ్రేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారం: ఇందులో 96శాతం నీరు ఉండటం వల్ల వేసవిలో శరీరానికి అవసరమైన తేమను అందించి, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక సంజీవని వంటిది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల కొవ్వును కరిగించి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన పానీయం.
జీర్ణశక్తి మెరుగుదల: అసిడిటీ, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్సర్ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక అద్భుత ఔషధం.
శరీర ప్రక్షాళన (Detox): ఒక శక్తివంతమైన డీటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరంలోని విషతుల్యాలను (Toxins) బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
మెదడు చురుకుదనం: ఒత్తిడిని తగ్గించి, జ్ఞాపకశక్తిని మరియు ఏకాగ్రతను పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మనసు ప్రశాంతంగా మారి హాయిగా నిద్ర పడుతుంది.
చర్మ సౌందర్యం: ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మంపై సహజమైన మెరుపు వస్తుంది. ఎండ వల్ల వచ్చే దద్దుర్లు, దురదలు, సన్‌బర్న్ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
కిడ్నీల ఆరోగ్యం: మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడటమే కాకుండా, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను (UTI) తగ్గిస్తుంది. దీనివల్ల కాళ్ల వాపులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
రోగనిరోధక శక్తి: విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
రక్తపోటు నియంత్రణ: ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సమ్మర్‌లో వచ్చే అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.