బాప్‌రే.. మటన్ బోన్ సూప్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు!

29 march 2026

Jyothi Gadda

ఎవరికైనా ఎముకలు విరిగితే ఇంట్లో పెద్దవారు మేక లేదా పొట్టేలు కాళ్లతో చేసిన సూప్ తాగమని చెబుతుంటారు. దీన్ని పాయా అని, వాడుకలో మటన్ బోన్ సూప్, మటన్ లెగ్ సూప్ అని అంటుంటారు.

ఓ నివేదిక.. పొట్టేళ్లు, మేకల కాళ్లలో కాల్షియం, మెగ్నేషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొంది. ఇవి మన ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధకతకు చాలా అవసరం.

గొర్రె మాంసంలో ముఖ్యంగా వాటి కాళ్ల ఎముకల్లో ఉండే పోషకాలు చాలా రకాలుగా పనిచేస్తాయి. ఇవి మన ఎముకలకు, కీళ్లకు, జుట్టుకు, చర్మానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి పనిచేస్తాయి. 

గొర్రె కాళ్లలో కొలాజెన్, జెలటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కీళ్ల ఆరోగ్యానికి సాయపడతాయని, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చర్మ సౌందర్యానికి కూడా కొలాజెన్ సాయపడుతుంది.

మేక/గొర్రె కాళ్లల్లో ఉండే కొలాజెన్ కీళ్లకు లూబ్రికెంట్‌లాగా పనిచేస్తుంది. చర్మంపై వచ్చే ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను ఇది తగ్గిస్తుంది. మటన్ లెగ్ సూప్ రోజూ తాగితే, చర్మం యవ్వనంగా మారుతుంది.

ఈ సూప్ రోజూ తాగడం వల్ల కేవలం ఎముకలు, చర్మానికే కాదు, శరీరంలోని ఇతర కొన్ని అవయవాల మెరుగైన పనితీరుకు కూడా దోహదపడుతుంది.

ఇందులో ఉండే గ్లైసిన్, ప్రొలైన్ వంటి అమైనో ఆమ్లాలు పేగుల పనితీరును నియంత్రించేందుకు, కాలేయ పనితీరును నియంత్రించడం ద్వారా శరీరంలోని డీటాక్సిఫికేషన్ ప్రాసెస్‌ను సరిగ్గా నిర్వర్తిస్తాయి.

ఈ సూప్‌తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సంబంధిత జబ్బులు, ఊబకాయం, ఇతర అనారోగ్యాలు ఉన్న వారు దీన్ని తీసుకోకపోవడం మంచిది.