పనస పండుతో పుష్కలమైన లాభాలు..వీళ్లకు మాత్రం విషమే!

24 march 2026

Jyothi Gadda

రోగనిరోధక శక్తి: ఇందులో ఉండే విటమిన్ సి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పనస తొనలతో డైజెషన్ బాగుంటుంది. శక్తిని పెంచే నేచురల్ ఫుడ్‌ పనస పండు.

గుండె ఆరోగ్యం: పనస పండు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఇది రక్తపోటును (BP) అదుపులో ఉంచుతుంది, తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

జీర్ణక్రియ: పనసలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేసి, జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది.

చర్మం, కంటి చూపు: విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా, చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. కేశసౌందర్యానికి కూడా మేలు చేస్తుంది.

కానీ, ఈ పనస పండు అందరికీ పడదు. కిడ్నీ సమస్యలు: పనసలో పొటాషియం చాలా ఎక్కువ. కిడ్నీ వ్యాధిగ్రస్తులు పొటాషియంను బయటకు పంపలేరు. ఇది శరీరంలో పేరుకుపోయి ఇతర సమస్యలకు దారితీస్తుంది.

అలర్జీ: కొంతమందికి పనస పండు తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు లేదా దురద రావచ్చు. బిర్చ్ పోలెన్ అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

సర్జరీకి ముందు: శస్త్రచికిత్స జరగబోయే రోగులు దీనిని తినకూడదు, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలు, మత్తు మందు ప్రభావంపై ప్రభావం చూపవచ్చు.

గర్భిణీలు, బాలింతలు: వీరు పనస పండు అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పనస పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కానీ దానిని పరిమితంగా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.