చికెన్, మటన్ ఇష్టపడని వారు వాటి స్థానంలో పుట్టగొడుగుల్ని ఎక్కువగా తీసుకుంటారు. మాంసం రుచికి ఏమాత్రం తీసిపోకుండా ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పుట్టగొడుగుల్లో విటమిన్ డి2, విటిమిన్ డిలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకలు, కండరాలని బలంగా చేస్తాయి. విటమిన్ డి లోపంతో బాధపడేవారు. వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు.
పుట్టగొడుగుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి విటమిన్ డి మంచి మూలం. వీటిని రోజూ తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు చాలా బలంగా మారతాయి.
పుట్టగొడుగులు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. ఇందులో ఉండే పొటాషియం, సోడియం నిష్పత్తిగా తక్కువగా ఉంది. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
పుట్టగొడుగుల్లో సెలినీయం ఉంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. రోజూ తింటే మెదడు సామర్థ్యం పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
పుట్టగొడుగుల్లో ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో సోడియం లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
మష్రూమ్స్‌లోని యాంటీ ఇక్సిడెంట్స్ కారణంగా స్ట్రెస్ తగ్గుతుంది. దీంతో పాటు సెల్ డ్యామేజ్ కూడా తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్య సమస్యలు తగ్గుతుంది.
పుట్టగొడుగులని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా మారతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మష్రూమ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బ్రెయిన్, దాని నరాలపై ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో నరాలు ఆరోగ్యంగా ఉంటాయి.