ఆపిల్ - రోజుకు ఒకటి తింటే వైద్యుడి అవసరం ఉండదని అంటారు. పోషకాలను పుష్కలంగా కలిగి ఉండే ఈ ఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా..?
ఆపిల్‌లో ఫైబర్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే కారణంగా, శరీరానికి శక్తినిస్తాయి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. కానీ, చాలామంది ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం అనుసరిస్తుంటారు.
నీరు మన శరీరానికి అత్యవసరమైనది, ఇది జీవక్రియలను సక్రమంగా నిర్వహించడానికి, పోషకాలను రవాణా చేయడానికి , శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది.
నీరు మన శరీరానికి అత్యవసరమైనది, ఇది జీవక్రియలను సక్రమంగా నిర్వహించడానికి, పోషకాలను రవాణా చేయడానికి , శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది.
సాధారణంగా తిన్న తర్వాత శరీరంలో జీర్ణక్రియ జరగడానికి కొంత సమయం అవసరం. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నీరు మన శరీరానికి అత్యవసరమైనది. ఇది జీవక్రియలను సక్రమంగా నిర్వహించడానికి, పోషకాలను రవాణా చేయడానికి , శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది.
ఆపిల్ తినడం ద్వారా ఉత్పన్నమయ్యే ఆమ్లాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. కానీ, వెంటనే నీళ్లు తాగడం వలన ఆ ఆమ్లత తగ్గిపోతుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమవకుండా ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఏవైనా పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ముఖ్యంగా చల్లటి నీళ్లు అయితే, జీర్ణాగ్ని మందగిస్తుంది. ఇది అజీర్ణంకు దారి తీస్తుంది. దాంతోపాటు శరీరంలో 'టాక్సిన్స్' పేరుకుపోయే అవకాశం ఉంటుంది.