నల్లగా ఉన్నాయనుకునేరు.. ఆ సమస్యలకు సంజీవని!

25 march 2026

Jyothi Gadda

సాధారణ క్యారెట్లతో పోలిస్తే నల్ల క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు 12 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. వీటి ప్రయోజనాలు

గుండెకు రక్షణ: నల్ల క్యారెట్లు రక్తపోటును (BP) నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూసి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కంటి చూపు మెరుగుదల: వీటిలో ఉండే బీటా కెరోటిన్, ఆంథోసైనిన్ కంటి రెటినాను రక్షిస్తాయి. కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు గడిపేవారికి, కంటి అలసటను తగ్గించడానికి ఇది మేలు చేస్తుంది.

జీర్ణ వ్యవస్థకు మేలు: నల్ల క్యారెట్‌లో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉంటుంది. ఇది తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.  ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

క్యాన్సర్ నిరోధక గుణాలు: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. తద్వారా వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి.

మెరిసే చర్మం: రక్తంలోని మలినాలను శుభ్రపరచడంలో నల్ల క్యారెట్ సహాయపడుతుంది. దీనివల్ల మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది సహజ సిద్ధమైన యాంటీ ఏజింగ్ ఆహారంగా పనిచేస్తుంది.

బరువు తగ్గడానికి: తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల వీటిని తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించి బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

అల్జీమర్స్ నివారణ: నల్ల క్యారెట్లు మెదడు కణాల క్షీణతను అడ్డుకుంటాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో మరియు వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షణ ఇవ్వడంలో ఇవి తోడ్పడతాయి.

నల్ల క్యారెట్లను పచ్చిగా సలాడ్లలో తీసుకోవచ్చు లేదా జ్యూస్ చేసుకుని తాగవచ్చు. ఉత్తర భారతదేశంలో వీటితో కాంజీ అనే పులియబెట్టిన పానీయాన్ని తయారు చేస్తారు. ఇది ప్రోబయోటిక్స్‌కు గొప్ప వనరు.