Gongura Roti Pachadi: ఇది తెలియక ఇన్నాళ్లూ గోంగూర పచ్చడి రుచిని మిస్ అయ్యారు
ఆంధ్రా భోజనంలో గోంగూరకు ఉండే ప్రత్యేకత గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ రోట్లో నూరిన గోంగూర పచ్చడి ఉంటే పక్కన ఏ కూర లేకపోయినా కడుపునిండా అన్నం తినేయవచ్చు. సాధారణంగా చాలామంది గోంగూరను ఉడికించి పచ్చడి చేస్తుంటారు, కానీ ఒక్కో పదార్థాన్ని విడివిడిగా వేయించి, చివరగా పచ్చి ఉల్లిపాయ వేసి దంచితే ఆ పచ్చడికి వచ్చే రుచే వేరు. ఈ పల్లెటూరి స్టైల్ గోంగూర రోటి పచ్చడి అన్నం, రాగి సంగటి, చపాతీ ఇలా దేనిలోకైనా అద్భుతంగా కుదురుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
