మూడు రోజులుగా తలుపులు మూసిన ఇంటి నుంచి ఒక్కటే దుర్వాసన.. తీరా చేస్తే షాక్!
బెంగళూరులోని బనశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. పద్మనాభనగర్‌లోని ఓ నివాసంలో 18 ఏళ్ల సోహమ్ దాస్‌ను అతడి తల్లి సహజీవన భాగస్వామి సుదీప్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుదీప్ మైసూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సీమా దాస్ అనే మహిళతో సుదీప్ గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. గత రెండేళ్లుగా సీమా, ఆమె కుమారుడు సోహమ్, సుదీప్ ముగ్గురూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. సోహమ్ చదువుకు, ఇంటి నిర్వహణ ఖర్చులకు కూడా సుదీప్ ఆర్థికంగా సహాయం చేసేవాడని తెలుస్తోంది. అయితే ఇటీవల సీమా, సుదీప్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. సీమాకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానం సుదీప్‌లో పెరిగినట్లు సమాచారం.
ఈ క్రమంలో గత ఆరు నెలలుగా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి సుదీప్ గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 16న సీమాను తిరిగి తనతో కలిసి ఉండేలా ఒప్పించేందుకు ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో సుదీప్ రాకను సోహమ్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన సుదీప్ సోహమ్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం సీమాపై కూడా దాడి చేసి ఆమెను ఓ గదిలో బంధించినట్లు తెలుస్తోంది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె మూడు రోజుల పాటు గదిలోనే ఉండిపోయింది. ఈ నెల 19న ఇంటి యజమాని, పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి బాత్‌రూమ్‌లో సోహమ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీమాను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై బనశంకరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సుదీప్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఒక సమాచారం ఉండగా, మరో సమాచారం ప్రకారం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..