ఈ సినిమాల్లో హీరోల కన్నా విలన్లే తోపు.. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ !!
సినిమా.. ఒక ఎంటర్టైన్‌మెంట్ అని చెప్పడం కంటే కూడా నేటి కాలంలో ఒక ఎమోషన్ లాగా మారిపోయింది. అయితే ఎక్కువ సినిమాల్లో విలన్ పాత్రలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోయినా.. కొన్ని చిత్రాల్లో మాత్రం హీరోలను కూడా డామినేట్ చేస్తూ ఉంటారు. అలా హీరోలకన్నా విలన్లే నెక్స్ట్ లెవెల్లో అదరగొట్టిన సందర్భాలు ఉన్నాయి. వారెవరు ? ఆ సినిమాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

సినిమా.. ఒక ఎంటర్టైన్‌మెంట్ అని చెప్పడం కంటే కూడా నేటి కాలంలో ఒక ఎమోషన్ లాగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటున్నాయి. అయితే కొన్ని మెప్పిస్తే కొన్ని మాత్రం నిరాశపరుస్తాయి. అయితే ఏ సినిమాకైనా కథ ప్రాణమైతే.. ఆ కథను నడిపించే హీరో, విలన్ క్యారెక్టర్స్ కూడా అంతే ముఖ్యం. ఒక నాణేనికి ఉన్న రెండు వైపులా ఉండే ఈ పాత్రల మధ్య జరిగే సంఘర్షణే ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తుంది. అయితే ఎక్కువ సినిమాల్లో విలన్ పాత్రలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోయినా.. కొన్ని చిత్రాల్లో మాత్రం హీరోలను కూడా డామినేట్ చేస్తూ ఉంటారు. అలా హీరోలకన్నా విలన్లే నెక్స్ట్ లెవెల్లో అదరగొట్టిన సందర్భాలు ఉన్నాయి. వారెవరు ? ఆ సినిమాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
విలన్స్ అదరగొట్టిన సినిమాలు..
నీలాంబరి.. భారతీయ చలనచిత్ర చరిత్రలో విలన్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ‘నరసింహ’ చిత్రంలోని నీలాంబరి. రమ్యకృష్ణ ఈ పాత్రలో ఒలికించిన అహంకారం, కసి.. నరసింహపై ఆమెకు ఉన్నమోజు కలిపి ఆ పాత్రను ఒక లెజెండరీగా మార్చాయి. క్లైమాక్స్‌లో ఆమె మరణం కంటే, ఆ పాత్ర చూపించిన రాజసం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. రమ్యకృష్ణ కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయి పాత్రగా చెప్పవచ్చు.
గబ్బర్ సింగ్.. బాలీవుడ్ క్లాసిక్ ‘షోలే’లో అంజద్ ఖాన్ పోషించిన గబ్బర్ సింగ్ పాత్ర విలనిజానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. “అరే ఓ సాంబ.. కిత్నే ఆద్మీ థే” అనే ఒక్క డైలాగ్ దశాబ్దాలు గడిచినా నేటికీ మార్మోగుతూనే ఉంది. ఆ రాయిపై నిలబడి, నవ్వుతూనే భయం పుట్టించే గబ్బర్ సింగ్ మేనరిజం వెండితెరపై ఒక చెరగని ముద్ర వేసింది. డైలాగ్ డెలివరీలో ఆ వైవిధ్యమే ఆ పాత్రను చిరస్థాయిగా నిలిపింది.
గోపీచంద్.. తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలతోనే సంచలనం సృష్టించిన నటుడు గోపీచంద్. ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో ఆయన చూపించిన క్రూరత్వం, మేనరిజమ్స్ హీరోలకు గట్టి పోటీనిచ్చాయి.
సోనూ సూద్..
అరుంధతి చిత్రంలో పోషించిన పశుపతి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మంత్ర తంత్రాల నేపథ్యం, ఆ గంభీరమైన కంఠస్వరం ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించాయి. ఆ సినిమా భారీ విజయంలో పశుపతి పాత్ర పాత్ర సింహభాగం అని చెప్పవచ్చు.
భైరవుడు..
ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘స్పైడర్’. ఇందులో మహేష్ బాబు ‘శివ’ అనే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌గా నటించారు. అలానే ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య పోషించిన సైకో విలన్ ‘భైరవుడు’ పాత్ర హైలైట్‌గా నిలిచింది. హీరో, విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
