AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : సన్ గ్రూప్ ఉద్యోగులకు కావ్య మారన్ బంపర్ ఆఫర్.. పెళ్లి కానుకగా గోల్డ్ రింగ్స్ !!

స్టార్ మూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్- సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. కాగా ఈరోజు (నవంబర్ 21) చెన్నైలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే కావ్య తన పెళ్లి సందర్భంగా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇచ్చినట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది.

Watch : సన్ గ్రూప్ ఉద్యోగులకు కావ్య మారన్ బంపర్ ఆఫర్.. పెళ్లి కానుకగా గోల్డ్ రింగ్స్ !!
Kavya Maaran
Korivi Jayakumar
|

Updated on: Nov 21, 2026 | 3:37 PM

Share

స్టార్ మూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్- సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ప్రత్యేకమైన సెల్ఫ్-రెస్పెక్ట్ మ్యారేజ్ పద్దతిలో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాలతో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి.

కాగా ఈరోజు (నవంబర్ 21) చెన్నైలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చెన్నై ఎయిర్ పోర్టులో దర్శనమిస్తున్నారు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ, దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ చెన్నైకి చేరుకున్నారు. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన కుటుంబంతో కలిసి కనిపించారు. దాంతో వీరంతా విమానాశ్రయానికి వచ్చిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కావ్యా తన పెళ్లి సందర్భంగా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇచ్చినట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది.

సన్ గ్రూప్ ఉద్యోగులకు బంగారు ఉంగరాలు..

కాగా కావ్య పెళ్లి సందర్భంగా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బంగారు ఉంగరాలు, గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ వీడియోలను గమనిస్తే.. ఉద్యోగులు స్పెషల్ గిఫ్ట్ బాక్సులతో కనిపిస్తున్నారు. అందులో అనిరుధ్ – కావ్య వెడ్డింగ్ కార్డుతో పాటు చాక్లెట్లు, గోల్గ్ రింగ్ కూడా ఉన్నాయి. మరికొందరు మాత్రం తమకు గోల్డ్ కాయిన్స్ ఇచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా నవంబర్ 25న ఉద్యోగుల కోసం స్పెషల్ లంచ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్డులో రాసి ఉంది. అయితే పెళ్లి కానుకగా ఎంతమంది ఉద్యోగులకు బహుమతులు అందించారనే వివరాలపై సన్ గ్రూప్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అనిరుధ్.. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘3’ సినిమాతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే చరిత్ర సృష్టించారు. ధనుష్ ఆలపించిన “Why This Kolaveri Di” పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయి.. భారతీయ సంగీత చరిత్రలోనే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత వరుసగా తమిళంలో ‘వీఐపీ’, ‘కత్తి’, ‘పేట’, ‘మాస్టర్’, ‘బీస్ట్’, ‘విక్రమ్’, ‘జైలర్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించి తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ఒకప్పుడు తమిళ సినిమాలకే పరిమితమైన ఈ యువ సంగీత దర్శకుడు.. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో సైతం రాణిస్తూ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత డిమాండ్ ఉన్న కంపోజర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

వైరల్ వీడియో..

Follow Us