AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: అయ్యయ్యో.. బంగారం ధరలు ఇలా పడిపోతున్నాయ్ ఏంటి.. ఊహించని విధంగా రూ.12 వేలు క్రాష్..

బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. ఈ వారంలో పసిడి ధరలు నేలచూపులు చూశాయి. ఒకేసారి ఎవరూ ఊహించని రీతిలో భారీగా పతనాన్ని చవిచూశాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గనున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాాటలు నిజమయ్యేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. వచ్చే వారంలో కూడా ఇలాగే ఉంటాయా..?

Venkatrao Lella
|

Updated on: Nov 21, 2026 | 3:36 PM

Share
బంగారం ధరలు గత కొద్ది నెలలుగా భారీగా కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వారంలో మరింతగా పడిపోయాయి. ఏకంగా నవంబర్ 15 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు ఈ ఒక్కవారంలోనే 10 శాతం మేర పతనమయ్యాయి. దీంతో 14 నెలల కనిష్టానికి ధరలు క్రాష్ అయ్యాయి. అమెరికన్ డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే అంచనాలు పసిడి ధరల తగ్గుదలకు ప్రధానంగా కారణమవుతున్నాయి.

1 / 5
గ్లోబల్ మార్కెట్లలో బంగారంను ఎక్కువమంది విక్రయిస్తున్నారు. అమ్మకాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఒత్తిడి పెరిగి గోల్డ్ రేట్లు డౌన్ అవుతున్నట్లు ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. అమ్మకాల ఒత్తిడి కారణంగా గోల్డ్ రేట్లు తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో స్పాట్ 9.5 శాతం మేర తగ్గడంతో 8 నెలల్లోనే భారీ పతనాన్ని చవిచూశాయి.

2 / 5
నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,620 వద్ద ప్రారంభమవ్వగా.. నవంబర్ 21 నాటికి రూ.1,25,080కి చేరుకుంది. అంటే ఈ వారంలో మొత్తం రూ.12,540 తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర నవంబర్ 15న రూ.1,26,150గా ఉండగా.. శనివారం నాటికి రూ.1,14,650కి చేరుకుంది.

3 / 5
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర వారం రోజుల్లోనే రూ.11,500 మేర తగ్గిందని చెప్పవచ్చు. శనివారం ఒక్కరోజే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గగా.. 22 క్యారెట్ల రేటు రూ.450 మేర పతనమైంది. సోమవారం నుంచి గోల్డ్ మార్కెట్లు ప్రారంభం కానుండగా.. ఇదే పతనం కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
ఇంకా రూ.14 వేలు తగ్గితే ఆభరణాల కోసం ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.లక్షకు చేరుకునే అవకాశాలున్నాయి. ఇదే పతనం కొనసాగితే ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి గోల్డ్ రేట్లు రూ.లక్షకు దిగిరావడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అటు వెండి ధరలు కూడా నేలచూపులు చూస్తున్నాయి. నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1.95 లక్షల వద్ద ఉండగా.. నవంబర్ 21 నాటికి 1.75 లక్షలకు చేరుకున్నాయి. అంటే ఒకేసారి రూ.20 వేల మేర పడిపోయాయి.

5 / 5
Follow Us