19 November 2026
Subhash
బజాజ్ ఆటో పల్సర్ 180ని (Bajaj Pulsar 180) మరోసారి నిలిపివేసింది. నాలుగేళ్ల విరామం తర్వాత లాంచ్ చేసిన ఆరు నెలలకే కంపెనీ వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
ఎందుకు తొలగించింది అనే వివరాలు మాత్రం బజాజ్ ఆటో అధికారికంగా వెల్లడించలేదు. ఎందుకనేదానిపై చర్చ మొదలైంది.
180సీసీ సెగ్మెంట్‌లో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180కి పోటీగా.. బజాజ్ ఆటో పల్సర్ 180ని తీసుకొచ్చింది. అమ్మకాలు లేకపోవడంతో 2022లో తొలిసారి నిలిపివేసింది.
2026 ఏప్రిల్‌లో పల్సర్ 180ని మళ్లీ లాంచ్ చేసింది. దాన్ని తాజాగా వెబ్‌సైట్ లిస్టులోంచి తొలగించింది. ప్రస్తుతం పల్సర్ 125, పల్సర్ 150, 220ఎఫ్ బైక్‌లను మాత్రమే వెబ్‌సైట్‌లో చూపిస్తోంది.
విక్రయాల పరంగా అంచనాలను అందుకోని సందర్భంలో బజాజ్ తన మోడళ్లను నిలిపివేయడం కొత్తేం కాదు. పల్సర్ 180నే కాదు.. ఈ ఏడాది జూన్‌లో ఎన్125 మోడల్‌ను కూడా బజాజ్ ఆటో నిలిపివేసింది.
పల్సర్ 125, పల్సర్ 150కి ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. 220కీ సపరేట్ ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఎటొచ్చి 180కి ఆదరణ అంతంత మాత్రమనే చెప్పాలి.
ఈ బైక్‌ను తీసుకొచ్చిన ఆరు నెలలకే నిలిపివేయడం గమనార్హం. భవిష్యత్‌లో మళ్లీ తీసుకొచ్చే అవకాశం కూడా లేనట్లు తెలుస్తోంది.
అయితే పల్సర్ క్లాసిక్‌లో 125, 150, 220లకు మాత్రమే నెక్ట్స్ జనరేషన్‌లు వచ్చే అవకాశం ఉంది.