AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలోనే ఉంది.. కానీ భారతీయులకు నో ఎంట్రీ.. ఆ మిస్టరీ గ్రామం కథేంటి ??

భారతీయులకు చేతిలో పాస్‌పోర్ట్ లేదా ఒక ఐడీ కార్డు ఉంటే చాలు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన దేశంలో ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. కానీ మన దేశం నడిబొడ్డున ఉండి కూడా.. మనవాళ్లే అడుగుపెట్టలేని ఒక వింత ఊరు ఉందంటే నమ్ముతారా? ఆ మిస్టరీ గ్రామం ఏంటి? దాని వెనుక ఉన్న కథేంటో చూద్దాం..

ఇండియాలోనే ఉంది.. కానీ భారతీయులకు నో ఎంట్రీ.. ఆ మిస్టరీ గ్రామం కథేంటి ??
Dahagram Angarpota Village
Korivi Jayakumar
|

Updated on: Nov 21, 2026 | 5:18 PM

Share

భారతీయులకు చేతిలో పాస్‌పోర్ట్ లేదా ఒక ఐడీ కార్డు ఉంటే చాలు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన దేశంలో ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. కానీ మన దేశం నడిబొడ్డున ఉండి కూడా.. మనవాళ్లే అడుగుపెట్టలేని ఒక వింత ఊరు ఉందంటే నమ్ముతారా? అక్కడ అడుగుపెట్టాలంటే విదేశాలకు వెళ్లినట్టు ప్రభుత్వ ప్రత్యేక అనుమతి ఉండాల్సిందే. లేదంటే సరిహద్దు దగ్గరే ఆపేస్తారని తెలుసా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఇంతకీ మన దేశంలో ఉంటూనే మనకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టిన ఆ మిస్టరీ గ్రామం ఏంటి? దాని వెనుక ఉన్న కథేంటో చూద్దాం.

ఆ ఊరు ఏది ? ఎక్కడుందంటే ??

ఆ మిస్టరీ గ్రామమే ‘దహాగ్రామ్-అంగర్‌పోటా’. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లా సరిహద్దుల్లో ఉంటుంది. భౌగోళికంగా చూస్తే నాలుగు వైపులా భారత భూభాగమే కనిపిస్తుంది. కానీ ఈ ఊరు మాత్రం బంగ్లాదేశ్‌కు చెందినది. 2015లో భారత్-బంగ్లాదేశ్ మధ్య చారిత్రాత్మక భూ సరిహద్దు ఒప్పందం జరిగినప్పుడు.. మన దేశం దాదాపు 111 చిన్న ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు అప్పగించింది. అయితే ఆ సమయంలో ఈ ఒక్క ప్రాంతాన్ని మాత్రం అలాగే వదిలేశారట. 1992కి ముందు వరకు ఇక్కడి జనం నరకం చూశారని.. తమ సొంత దేశమైన బంగ్లాదేశ్ కేవలం 178 మీటర్ల దూరంలోనే ఉన్నా అక్కడికి వెళ్లడానికి నేరుగా దారి ఉండేది కాదని వాపోతున్నారు. ఊరి నుంచి బయటకు రావాలన్నా, లోపలికి వెళ్లాలన్నా భారత్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేక, కనీస సౌకర్యాలు అందక తాము ఒక ఓపెన్ జైలులో బందీలమయ్యామని స్థానికులు చెబుతున్నారు.

అయితే 1974లో రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరగ్గా.. దాని ప్రకారం 178 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పు ఉన్న ‘టిన్ బిఘా కారిడార్’ అనే భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు లీజుకు ఇవ్వడానికి భారత్ ఒప్పుకుంది. 1992లో ఈ దారి అందుబాటులోకి వచ్చాక వాళ్లకు సొంత దేశంతో నేరుగా సంబంధం ఏర్పడింది. అయితే మొదట్లో ఈ కారిడార్ గేట్లు రోజుకు 12 గంటలు మాత్రమే తెరిచి ఉండేవని.. సమయానికి గేటు దాటకపోతే మరుసటి రోజు దాకా అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చేది. చివరికి 2011లో భారత ప్రభుత్వం ఈ కారిడార్‌ను 24 గంటలూ తెరిచి ఉంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్ల దశాబ్దాల కష్టాలకు తెరపడింది. సాధారణ భారతీయులైనా, విదేశీ పర్యాటకులైనా ఈ ఊళ్లోకి నేరుగా వెళ్లడానికి వీల్లేదని.. ఎవరైనా ఈ గ్రామాన్ని చూడాలనుకుంటే ప్రభుత్వ ప్రత్యేక అనుమతి లేదా సరైన పాస్‌పోర్ట్, పత్రాల తనిఖీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని వివరిస్తున్నారు.

అంతా విదేశీ వాతావరణమే..

సుమారు 18.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ఊళ్లో 20 వేలకు పైగా బంగ్లాదేశ్ పౌరులు ఉంటారు. మన దేశం చుట్టూ ఉన్నా, ఈ ఊరి గడప దాటితే చాలు అంతా మారిపోతుంది. ఇక్కడ మన రూపాయి చెల్లదు, బంగ్లాదేశ్ కరెన్సీనే వాడతారు. స్కూళ్లు, ఆస్పత్రుల నుంచి మొబైల్ నెట్‌వర్క్ దాకా అన్నీ బంగ్లాదేశ్ ప్రభుత్వమే నడుపుతుంది. చట్టాలు కూడా వాళ్లవే. ఒక్కమాటలో చెప్పాలంటే మన దేశం లోపలే ఉన్న ఒక చిన్న విదేశం ఇది అని చెప్పవచ్చు. కాగా ఇది రెండు దేశాల సరిహద్దులకు సంబంధించిన సున్నితమైన ప్రాంతం కావడంతో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

Follow Us
ఇండియాలోనే ఉన్నా.. ఆ గ్రామం లోకి భారతీయులకు నో ఎంట్రీ !!
ఇండియాలోనే ఉన్నా.. ఆ గ్రామం లోకి భారతీయులకు నో ఎంట్రీ !!
నీళ్లలో ఈ రాళ్ళను కలిపి మొక్క చుట్టూ పోస్తే.. గులాబీలు గుత్తులు
నీళ్లలో ఈ రాళ్ళను కలిపి మొక్క చుట్టూ పోస్తే.. గులాబీలు గుత్తులు
వాకింగ్‌తో బరువు తగ్గాలా? రోజుకు ఎన్ని స్టెప్పులు వేయాలో తెలుసా?
వాకింగ్‌తో బరువు తగ్గాలా? రోజుకు ఎన్ని స్టెప్పులు వేయాలో తెలుసా?
చలికాలంలో వాటర్ ట్యాంక్ నీళ్లు వేడిగా మార్చుకోవాలా?..
చలికాలంలో వాటర్ ట్యాంక్ నీళ్లు వేడిగా మార్చుకోవాలా?..
ట్యాంకుల వేటకు భారత్ కొత్త బ్రహ్మాస్త్రం.. బఘీరా క్షిపణి ఎంట్రీ!
ట్యాంకుల వేటకు భారత్ కొత్త బ్రహ్మాస్త్రం.. బఘీరా క్షిపణి ఎంట్రీ!
బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసేలా కాకుండా జిగురు లేకుండా ఇలా చేయండి 
బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసేలా కాకుండా జిగురు లేకుండా ఇలా చేయండి 
పీజీలు, అద్దె‌గదుల్లో ఉంటూ ఒంటరిగా ఫీలవుతున్నారా? హ్యాపీనెస్ దారి
పీజీలు, అద్దె‌గదుల్లో ఉంటూ ఒంటరిగా ఫీలవుతున్నారా? హ్యాపీనెస్ దారి
డబ్బుల ఆశ చూపించి యువకుడిని బలిచ్చారా? మహారాష్ట్రలో కలకలం!
డబ్బుల ఆశ చూపించి యువకుడిని బలిచ్చారా? మహారాష్ట్రలో కలకలం!
ఏ టిఫిన్ కి అయినా ఒక్కటే కారంపొడి.. హోటల్ స్టైల్ ల్లో చేసేయండి ఇల
ఏ టిఫిన్ కి అయినా ఒక్కటే కారంపొడి.. హోటల్ స్టైల్ ల్లో చేసేయండి ఇల
మనిషిలోని ఈ 3 భావోద్వేగాలే ప్రశాంతతకు అడ్డంకులు.. శ్రీకృష్ణుడు..
మనిషిలోని ఈ 3 భావోద్వేగాలే ప్రశాంతతకు అడ్డంకులు.. శ్రీకృష్ణుడు..