AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న సినిమా అని లైట్ తీసుకున్నారు.. కట్ చేస్తే.. 2025లో నవంబర్ 21న థియేటర్లను షేక్ చేసింది..

చిన్న సినిమా.. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. అలాగే కొత్త దర్శకుడు.. ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలై ఒక్కసారిగా సంచలనం క్రియేట్ చేసింది. సరిగ్గా ఏడాది క్రితం విడుదలైన ఆ మూవీ అటు కంటెంట్.. ఇటు మ్యూజిక్ పరంగానూ దుమ్మురేపింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా విడుదలై నేటికి ఏడాది. 2025 నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా.

చిన్న సినిమా అని లైట్ తీసుకున్నారు.. కట్ చేస్తే.. 2025లో నవంబర్ 21న థియేటర్లను షేక్ చేసింది..
Raju Weds Rambai
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2026 | 5:24 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేయాలనుకునే కొత్త దర్శకులకు అవకాశాల వేట అంత సులభం కాదు. ఎన్నో తిరస్కరణలు, ఆర్థిక ఇబ్బందులు, నిరాశల మధ్య పట్టుదలతో నిలబడితేనే అనుకున్న కథ తెరకెక్కుతుంది. అలాంటి సుదీర్ఘ పోరాటం, అంకితభావంతో రూపొంది, ఆ తర్వాత ప్రేక్షకుల ఆదరణతో సంచలనం సృష్టించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా గతేడాది అంటే 2025 నవంబర్ 21న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ దుమ్మురేపింది. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన ఈ సినిమా.. అటు ఓటీటీలోనూ రచ్చ రచ్చ చేసింది. ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే దర్శకుడు శైలు కంపాటి తన తొలి సినిమా ప్రయాణంలోని కష్టాలు, విజయం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

2015లో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శైలు కంపాటికి, 2017 నుంచి 2019 మధ్య కాలం ఎంతో సవాళ్లతో కూడుకున్నది. ఆర్థిక సమస్యల కారణంగా ఒక దశలో సొంత ఊరికి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి అభిమాని అయిన తన తండ్రి ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆరంభంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను కలిసినా, అనుభవం లేకపోవడం వల్ల అవకాశం దక్కలేదు. జీవనోపాధి కోసం కొంతకాలం స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన ఆయన, ఆ తర్వాత ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణును కలిసే ప్రయత్నం చేశారు. సురేష్ బొబ్బిలి సహాయంతో వేణుతో మాట్లాడగా, ‘విరాటపర్వం’ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన కథను విని ప్రోత్సహించారని శైలు గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

లాక్‌డౌన్ సమయంలో ఎదురైన నిరాశను దాటుకుని, ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ప్రాజెక్ట్ ద్వారా సంపాదించి దాచుకున్న రూ.30 వేలతో శైలు తన కథకు ఒక ‘డెమో రీల్’ సిద్ధం చేశారు. ఆ డెమో చూసి వేణు మెచ్చుకోవడంతో ఆయనలో కొత్త ఆశ చిగురించింది. ఆ తర్వాత డెమో రీల్‌తో పలువురు నిర్మాతలు, హీరోల చుట్టూ తిరిగారు. ఛాయ్ బిస్కెట్ అనురాగ్, శరత్ వంటి వారు కథలో కొన్ని మార్పులు సూచించినా, తన కథా విజన్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో శైలు అందుకు అంగీకరించలేదు. సుమంత్ ప్రభాస్ సహా పలువురు యువ హీరోలకు కథ వినిపించినా వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. వరుస తిరస్కరణల తర్వాత, తన కథకు కొత్త నటీనటులే సరైన న్యాయం చేయగలరని శైలు నిర్ణయించుకున్నారు. కథలోని ప్రపంచాన్ని సహజంగా తెరపై ఆవిష్కరించాలంటే కొత్త ముఖాలతోనే సాధ్యమని భావించి ‘రాజు వెడ్స్ రాంబాయి’ని కొత్తవారితో తెరకెక్కించారు. తొలుత చిన్న సినిమాగా, కొత్తవారి ప్రాజెక్ట్‌గా భావించినప్పటికీ.. విడుదలైన తర్వాత ఈ చిత్రం పెద్ద హిట్‌గా నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Follow Us
సినిమా వచ్చి ఏడాది.. అయినా తగ్గని క్రేజ్.. 2025లో థియేటర్లను షేక్
సినిమా వచ్చి ఏడాది.. అయినా తగ్గని క్రేజ్.. 2025లో థియేటర్లను షేక్
గ్రీన్ టీ vs గ్రీన్ కాఫీ.. ఫ్యాట్ తొందరగా కరగాలంటే ఏది బెస్ట్?
గ్రీన్ టీ vs గ్రీన్ కాఫీ.. ఫ్యాట్ తొందరగా కరగాలంటే ఏది బెస్ట్?
ఇండియాలోనే ఉన్నా.. ఆ గ్రామం లోకి భారతీయులకు నో ఎంట్రీ !!
ఇండియాలోనే ఉన్నా.. ఆ గ్రామం లోకి భారతీయులకు నో ఎంట్రీ !!
నీళ్లలో ఈ రాళ్ళను కలిపి మొక్క చుట్టూ పోస్తే.. గులాబీలు గుత్తులు
నీళ్లలో ఈ రాళ్ళను కలిపి మొక్క చుట్టూ పోస్తే.. గులాబీలు గుత్తులు
వాకింగ్‌తో బరువు తగ్గాలా? రోజుకు ఎన్ని స్టెప్పులు వేయాలో తెలుసా?
వాకింగ్‌తో బరువు తగ్గాలా? రోజుకు ఎన్ని స్టెప్పులు వేయాలో తెలుసా?
చలికాలంలో వాటర్ ట్యాంక్ నీళ్లు వేడిగా మార్చుకోవాలా?..
చలికాలంలో వాటర్ ట్యాంక్ నీళ్లు వేడిగా మార్చుకోవాలా?..
ట్యాంకుల వేటకు భారత్ కొత్త బ్రహ్మాస్త్రం.. బఘీరా క్షిపణి ఎంట్రీ!
ట్యాంకుల వేటకు భారత్ కొత్త బ్రహ్మాస్త్రం.. బఘీరా క్షిపణి ఎంట్రీ!
బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసేలా కాకుండా జిగురు లేకుండా ఇలా చేయండి 
బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసేలా కాకుండా జిగురు లేకుండా ఇలా చేయండి 
పీజీలు, అద్దె‌గదుల్లో ఉంటూ ఒంటరిగా ఫీలవుతున్నారా? హ్యాపీనెస్ దారి
పీజీలు, అద్దె‌గదుల్లో ఉంటూ ఒంటరిగా ఫీలవుతున్నారా? హ్యాపీనెస్ దారి
డబ్బుల ఆశ చూపించి యువకుడిని బలిచ్చారా? మహారాష్ట్రలో కలకలం!
డబ్బుల ఆశ చూపించి యువకుడిని బలిచ్చారా? మహారాష్ట్రలో కలకలం!