AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

తెలుగువారికి సుపరిచితమైన బాలనాగమ్మ కథతో జెమినీ, ఎన్టీఆర్ చిత్రాలు విజయవంతమయ్యాయి. మూడోసారి, కళాభారతి జమున స్వీయ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా బాలనాగమ్మ చిత్రాన్ని ప్రారంభించారు. హరనాథ్, ఎస్.వి. రంగారావులతో భారీగా రూపొందించిన ఈ సినిమా, రాజకీయ, వ్యక్తిగత, ఆర్థిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది.

Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
Balanagamma
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2026 | 8:34 PM

Share

తెలుగువారికి సుపరిచితమైన జానపద కథలలో బాలనాగమ్మ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఒక రాకుమార్తెను మాయల ఫకీరు ఎత్తుకుపోవడం, ఆమె కుమారుడు ఆమెను విడిపించడం అనే కాన్సెప్ట్‌తో సాగే ఈ కథ తరతరాలుగా ఆకట్టుకుంటోంది. ఈ కథను తెలుగులో రెండు సార్లు విజయవంతంగా సినిమాలుగా మలచగా, మూడోసారి ప్రారంభమైన ఒక చిత్రం మాత్రం తెరపైకి రాలేకపోయింది. ఆ మూడో చిత్రమే ప్రముఖ నటి కళాభారతి జమున స్వీయ నిర్మాణంలో రూపొందించిన బాలనాగమ్మ. మొట్టమొదటిసారిగా బాలనాగమ్మ కథను 1942లో జెమినీ స్టూడియో అధినేత ఎస్.ఎస్. వాసన్ సినిమాగా తీశారు. కనకమహాలక్ష్మి, బాలామణి, గోవిందరాజుల సుబ్బారావు, డాక్టర్ రావు, ఎస్. కమలాదేవి, పుష్పవల్లి, ఎల్. నారాయణరావు, లంక సత్యం వంటి ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. లక్షల్లో లాభాలు తెచ్చిపెట్టి, జానపద చిత్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ చిత్రంలోని బాలనాగమ్మ పాత్రతో బాలామణి పేరు ముందు బాలనాగమ్మ అనే బిరుదు చేరగా, మాయల ఫకీరు పాత్రలో నటించిన గోవిందరాజుల సుబ్బారావు మాయల ఫకీరుగా స్థిరపడిపోయారు. జెమినీ వారి ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. వాసన్ హిందీలో కూడా తీసి విజయం సాధించారు.

జెమినీ వారి బాలనాగమ్మ విజయం తర్వాత, 1959లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో మరోసారి ఈ కథ తెరకెక్కింది. నందమూరి తారక రామారావు, అంజలి దేవి, ఎస్.వి. రంగారావు ప్రధాన పాత్రల్లో నటించారు. అంజలి దేవి బాలనాగమ్మగా, ఎన్టీఆర్ కార్యవర్ధి రాజుగా, ఎస్.వి. రంగారావు మాయల ఫకీరుగా అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించి, కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో శోభన్ బాబు, హేమామాలిని వంటి వారు చిన్న పాత్రల్లో కనిపించారు. 1966లో కన్నడలో రాజ్ కుమార్, ఉదయ్ కుమార్ హీరోలుగా నరసింహరాజు ఫకీరు పాత్రలో నటించిన బాలనాగమ్మ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది.

ఈ విజయవంతమైన చిత్రాల తర్వాత, కళాభారతి జమున బాలనాగమ్మ కథతో మూడో చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. 1965లో స్వంత బ్యానర్‌పై, స్వంత సినిమా తీయాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సినిమాలో జమున బాలనాగమ్మగా, హరనాథ్ కార్యవర్ధి రాజుగా నటించారు. మునుపటి చిత్రాలలో మాయల ఫకీరుగా ప్రేక్షకులను మెప్పించిన ఎస్.వి. రంగారావునే ఈ పాత్రకు తిరిగి ఎంపిక చేశారు. ఫకీరు భార్య సంగుగా రాజశ్రీ నటించారు. జమున భర్త జూలూరి రమణారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఎస్.పి. కోదండపాని సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో కాకుండా ఈస్ట్‌మన్‌ కలర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని జమున ప్రణాళిక చేశారు. అప్పట్లోనే దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి కొంత భాగం షూటింగ్‌ను పూర్తి చేశారు. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థికపరమైన సమస్యలన్నీ తోడై, జమున నిర్మించిన బాలనాగమ్మ చిత్రాన్ని మధ్యలోనే నిలిపివేయక తప్పలేదు. ఈ సినిమాను పూర్తి చేయాలని ఆ తర్వాత ఎంతో మంది కోరినప్పటికీ, జమున ఇష్టపడలేదు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రం పత్రికల్లో విడుదలయ్యాయి, పతాక శీర్షికలతో వార్తలు వచ్చాయి.

Follow Us