AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోస్టాఫీసులో బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా నిబంధనలు మారాయ్..

Post Office Savings Account: గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు చాలామంది పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉన్నారు. అయితే ఇక నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. మినిమం బ్యాలెన్స్, లావాదేవీలకు కొత్త ఛార్జీలు విధించారు. ఇక నుంచి ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా రుసుం పడుతుంది.

పోస్టాఫీసులో బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా నిబంధనలు మారాయ్..
Post Office
Venkatrao Lella
|

Updated on: Nov 21, 2026 | 6:07 PM

Share

పోస్టాఫీస్‌లో మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందా..? అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే పోస్టాఫీస్ తమ సేవింగ్స్ ఖాతా నియమాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నూతన రూల్స్‌కు సంబంధించి కొత్త సీబీఎస్ మాన్యువల్ జారీ చేసింది. సేవింగ్స్ అకౌంట్ మూసివేయడం, నిధుల బదిలీ, ఇనాక్టివ్ అకౌంట్లు, ఖాతాదారుడు మరణిస్తే నిధులను తీసుకోవడం వంటి నిబంధణలు ఇందులో ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో జారీ చేసిన పాత మాన్యువల్ స్థానంలో ఈ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారు. నవంబర్ 17,2026న జారీ చేసిన ఈ కొత్త నియమాల గురించి తెలుసుకుందాం.

రూ.500 కంటే తక్కువ అమౌంట్ ఉందా..?

-స్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లో రూ.500 కనీస బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉంచాలి. లేకపోతే ఏడాదికి రూ.50 పెనాల్టీ పడుతుంది. దీంతో పాటు 18 శాతం జీఎస్టీ కూడా ఉంటుంది. దీని వల్ల మినిమం బ్యాలెన్స్ ఖాతాలో మెయింటైన్ చేయకపోతే అదనపు భారం పడుతుందని చెప్పవచ్చు

-మూడేళ్ల పాటు మీరు అకౌంట్ వాడకపోతే ఇనాక్టివ్ అవుతుంది. డిపాజిట్, విత్ డ్రా లాంటి ఎలాంటి లావాదేవీలు చేయకపోతే సైలెంట్ ఖాతా పరిగణిస్తారు. అయితే ఖాతాలో వడ్డీ జమ అయితే దానిని ట్రాన్సాక్షన్‌గా పరిగణించరు. వడ్డీ జమ అయినంత మాత్రన మీ అకౌంట్ యాక్టివ్ అవ్వదని ఖాతాదారులు గమనించాలి

-ఒక ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌కు మీ ఖాతాను బదిలీ చేసుకోవాలంటే ఇక నుంచి సర్వీస్ ఛార్జీలు ఉంటాయి. రూ.100 రుసుంతో పాటు జీఎస్టీ కూడా ఉంటుంది. మీరు ఖాతాను ఒక బ్రాంచ్‌ నుంచి మరో బ్రాంచ్‌కు బదిలీ చేసుకోవాలంటే ఈ నిబంధనల గురించి తెలుసుకోండి

-ఖాతాదారుడు మరణించిన సమయంలో కుటుంబసభ్యులు అతడి అకౌంట్లోని డబ్బులను క్లెయిమ్ చేసుకునేందుకు కొత్త మాన్యువల్ రూపొందించారు. ఒకవేళ ఖాతాదారుడు నామినీని పొందుపరిస్తే.. ఎలాంటి పరిమితి లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. రూ.5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకునేందుకు వారసత్వ ధృవీకరణ పత్రం అక్కర్లేదు

-పోస్టాఫీస్ 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ పథకంలో 4 ఏళ్ల తర్వాతనే ఖాతాను మూసివేయడానికి అనుమతి ఉంటుంది. 4 ఏళ్ల కంటే ముందు మీరు మూసివేయలేరు

-పోస్టాఫీస్ పథకాల నుంచి పెద్ద మొత్తంలో చేసే నగదు విత్ డ్రాలకు టీడీఎస్ నిబంధనలు వర్తిస్తాయి. ఒక ఆర్ధిక సంవత్సరంలో విత్ డ్రా చేసిన మొత్తం నగదుపై టీడీఎస్ వర్తిస్తుంది

-ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను సకాలంలో దాఖలు చేసేవారికి ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.కోటి వరకు దాటిన నగదు విత్ డ్రాలపై 2 శాతం టీడీఎస్ ఉంటుంది

-ఐటీఆర్ ఫైల్ చేయనివారికి రూ.కోటి దాటిన విత్ డ్రాలపై 5 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు విత్ డ్రాలపై 2 శాతం టీడీఎస్ ఉంటుంది.

Follow Us