AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamani : సౌందర్యను చూశాకే ఆ అలవాటు నేర్చుకున్నా.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నా.. హీరోయిన్ ఆమని..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు చాలా మంది ఉన్నారు. హీరోలు మాత్రమే కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సినీరంగంలో గుర్తొచ్చేవారిలో సౌందర్య, ఆమని ఒకరు. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌందర్యతో తనకున్న అనుబంధం గురించి ఆమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలాగే తన నుంచి నేర్చుకున్న అలవాట్లు గురించి చెప్పుకొచ్చారు.

Aamani : సౌందర్యను చూశాకే ఆ అలవాటు నేర్చుకున్నా.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నా.. హీరోయిన్ ఆమని..
Aamani, Soundarya
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2026 | 8:33 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ ఆమని గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తుంది. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ అలరిస్తుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో తన స్నేహితురాలు దివంగత హీరోయిన్ సౌందర్యతో తనకున్న అనుబంధం, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే ఒకసారి సౌందర్యను చూసి తాను ఓ అలవాటు చేసుకున్నానని.. ఇప్పటికీ దానినే ఫాలో అవుతున్నానని అన్నారు. తాను, సౌందర్య కలిసి ఓసారి షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సందర్భంలో జరిగిన సరదా విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్ పాస్ తీసుకుని కూర్చున్న సమయంలో అక్కడ ఉన్న కాఫీ షాప్ వైపు చూస్తూ సౌందర్య కాఫీ తాగుదామా అని అడిగారట. హీరోయిన్లు కాఫీ తాగకూడదేమో, తనకు మంచి కలర్ ఉంటుంది కదా అని తాను మొదట ఆశ్చర్యపోయానని ఆమని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

అయితే సౌందర్య తనకు కాఫీ అంటే చాలా ఇష్టమని చెప్పడంతో, ఆ తర్వాత తాను కూడా మళ్లీ కాఫీ తాగడం మొదలుపెట్టానని సరదాగా వివరించారు. అయితే డాక్టర్ సూచన మేరకు ఈ మధ్య ఉదయం పూట ఖాళీ కడుపుతో కాఫీ మానేసి, సాయంత్రం వేళల్లో అప్పుడప్పుడు కొద్దిగా తీసుకుంటున్నట్లు తెలిపారు. సౌందర్యతో జరిగిన ఆ చిన్న సంఘటన తన జీవితంలో ఒక అలవాటును ఎలా మార్చిందో ఈ అనుభవం ద్వారా వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

ఆమని సినీ ప్రయాణం విషయానికి వస్తే.. 1973 నవంబర్ 16న జన్మించిన ఆమని, 1990లలో తమిళ చిత్రాలతో ప్రస్థానం మొదలుపెట్టి, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడిపంబ’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమాలో నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే ‘శుభలగ్నం’ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ‘శుభసంకల్పం’ సినిమాకు మరోసారి ఉత్తమ నటిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై అలరిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Follow Us