TV Actress : నెట్టింట గత్తరలేపుతున్న సీరియల్ భామ్మా.. వామ్మో.. గ్లామర్ ఫోజులతో మంటపుట్టిస్తుందిగా..
సాధారణంగా సీరియల్ హీరోయిన్లకు తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈమధ్యకాలంలో కన్నడ భామలు తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటూ సీరియల్స్ ద్వారా తమదైన ముద్ర వేస్తున్నారు. అయితే సీరియల్లో సింపుల్ లుక్స్.. నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. విభిన్న కథాంశాలతో ప్రసారమయ్యే ధారావాహికల్లో నటీనటుల సహజమైన అభినయం, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇటీవలి కాలంలో సినిమా తారల స్థాయిలోనే సీరియల్ నటీనటులకు కూడా ప్రత్యేకమైన అభిమాన గణం ఏర్పడుతోంది. కొందరు వెండితెర అవకాశాలు అందుకుంటుండగా, మరికొందరు సోషల్ మీడియాలో తమ లుక్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ అమూల్య గౌడ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు అమూల్య గౌడ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ‘మీనా’. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లో ఆమె మీనా పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమాయకత్వం, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి పాత్రలో ఆమె కనిపిస్తున్నారు. భావోద్వేగ సన్నివేశాల్లో సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..
తెలుగులోకి రాకముందే అమూల్య గౌడ కన్నడ టెలివిజన్ రంగంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ‘శ్రీగౌరీ’ సీరియల్‌తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, పలు కన్నడ ధారావాహికల్లో నటించారు. అంతేకాకుండా కన్నడ ‘బిగ్ బాస్’ షోలోనూ పాల్గొని మరింత ప్రజాదరణ పొందారు. తెలుగులోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తన పాత్రతో ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..
అయితే సీరియల్‌లో ఎక్కువగా సంప్రదాయ చీరకట్టు, సింపుల్ లుక్స్‌లో కనిపించే అమూల్య గౌడ.. సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా భిన్నమైన స్టైల్‌లో దర్శనమిస్తున్నారు. మోడ్రన్ అవుట్‌ఫిట్స్, స్టైలిష్ ఫోటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సీరియల్‌లో కనిపించే అమూల్యకు, సోషల్ మీడియాలోని అమూల్యకు చాలా తేడా ఉందంటూ నెటిజన్లు ఆసక్తిగా కామెంట్లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..
