AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు దగ్గరయ్యాడు.. చివరకు ఏం జరిగిందంటే..

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో ఓ మహిళను మోసం చేసిన యువకుడిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది నెలల క్రితం పరిచయమైన యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివిధ అవసరాల పేరుతో ఆమె నుంచి విడతలవారీగా రూ.4 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు దగ్గరయ్యాడు.. చివరకు ఏం జరిగిందంటే..
Hyderabad Marriage Fraud
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 21, 2026 | 7:02 PM

Share

ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఆమెతో ఏకాంతంగా గడిపాడు.. ఆ తర్వాత.. ఆమెతో సన్నిహితంగా ఉంటూ విడతల వారీగా డబ్బులు కూడా వసూలు చేశాడు.. చివరకు అతని మాయమాటలు విని మోసపోయానని గ్రహించిన మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను శారీరకంగా లొంగదీసుకుని, ఆమె నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన యువకుడిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మియాపూర్‌లోని మదీనాగూడ ప్రాంతానికి చెందిన నరహరి సన్నిత్ రెడ్డి (23) అనే యువకుడిపై ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహం చేసుకుంటానంటూ నమ్మబలికి, సన్నిహితంగా మెలుగుతూనే ఆర్థికంగా కూడా బాధితురాలిని దోచుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

వివరాల్లోకి వెళితే, నిందితుడు నరహరి సన్నిత్ రెడ్డికి బాధితురాలితో సుమారు ఎనిమిది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిన తర్వాత, పెళ్లి చేసుకుంటానని ఆమెకు నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలో బాధితురాలి బలహీనతను, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను శారీరకంగా ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, వివిధ అవసరాల పేరుతో బాధితురాలి నుంచి విడతలవారీగా ఏకంగా రూ.4 లక్షల వరకు డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎంతకీ పెళ్లి ప్రస్తావన తేకపోవడమే కాకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసపోయానని గ్రహించిన బాధితురాలు చివరికి చందానగర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలు నిజమని నిర్ధారించుకున్న అనంతరం నిందితుడు నరహరి సన్నిత్ రెడ్డిని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

Follow Us
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
Optical Illusion: ఈ అరటి కాయల మధ్యలో ఉన్న పామును చూశారా ??
Optical Illusion: ఈ అరటి కాయల మధ్యలో ఉన్న పామును చూశారా ??
ఇంట్లో శాలిగ్రామాన్ని ఎలా ఉంచుకోవాలి? పూజా నియమాలు, దిశ, మహిళలు..
ఇంట్లో శాలిగ్రామాన్ని ఎలా ఉంచుకోవాలి? పూజా నియమాలు, దిశ, మహిళలు..
తెలంగాణకు నమో భారత్ ర్యాపిడ్ రైలు..! ఈ రూట్లోనే ప్రయాణం..
తెలంగాణకు నమో భారత్ ర్యాపిడ్ రైలు..! ఈ రూట్లోనే ప్రయాణం..
అబ్బాయిలు ఈ సినిమా చూస్తే భయపడిపోవాల్సిందే..
అబ్బాయిలు ఈ సినిమా చూస్తే భయపడిపోవాల్సిందే..
మీ ఇంట్లో ఏసీ ఉందా..? జస్ట్ రూ.250తో ఇలా చేస్తే అమేజింగ్ అంతే..!
మీ ఇంట్లో ఏసీ ఉందా..? జస్ట్ రూ.250తో ఇలా చేస్తే అమేజింగ్ అంతే..!
60 ఏళ్ల తర్వాత కొండగట్టు ఆంజనేయస్వామి నిజరూప దర్శనం.. ఎప్పటివరకు
60 ఏళ్ల తర్వాత కొండగట్టు ఆంజనేయస్వామి నిజరూప దర్శనం.. ఎప్పటివరకు