మీడియాలో రిపోర్టర్ గా పదేళ్ల అనుభవం ఉంది. 2021 నుంచి టీవీ9లో పని చేస్తున్నాను. అంతకుమందు ఈటీవీ లో రిపోర్టర్ గా దేశ రాజధాని ఢిల్లీలో పని చేశాను. జాతీయ రాజకీయాలు, సుప్రీంకోర్టు లీగల్ అంశాలపై నాలుగేళ్లు ఢిల్లీలో కవరేజ్ చేశాను. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీలో రైతుల ఆందోళనపై నాన్ స్టాప్ కవరేజ్, హైదరాబాద్ లో వరదలపై ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేసిన ప్రత్యేకతలు ఉన్నాయి. టీవీ9 కంటే ముందు ఈటీవీ-ఢిల్లీ, భారత్ టుడే, స్టూడియో-ఎన్ న్యూస్ ఛానెల్స్ లో పని చేసిన అనభువం ఉంది. ప్రస్తుతంలో తెలంగాణలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్టుగా కొనసాగుతూ.. అదనంగా విద్యారంగ, సామాజిక, సాంకేతిక అంశాలపై కవరేజ్ అందిస్తున్నాను. ప్రస్తుతం రాజకీయంగా బీజేపీ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, జనసేన, తెలంగాణ జనసమితి పార్టీల బీట్ రిపోర్టర్ గా కవరేజ్ చేస్తున్నాను. తెలంగాణలో ఆయా పార్టీల పూర్తి వార్తలను హైదరాబాద్ స్టేట్ బ్యూరో నుంచి కవర్ చేస్తున్నారు. దానితోపాటు తెలంగాణ విద్యాశాఖను కూడా చూస్తున్నాను. విద్య, ఉద్యోగ అప్ డేట్స్ పాటు ఆ రంగాల్లో సమస్యల వార్తల కవరేజ్ చేస్తున్నాను. ఇన్ అండ్ అవుట్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ తో టీవీ9 ద్వారా రాజకీయ, సామాజిక అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాను.
Hyderabad: షేక్‌పేట లేడీస్ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
షేక్‌పేటలోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కల్పన (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్‌లో నాసిరకం భోజనంపై ప్రశ్నించినందుకు నిర్వాహకులు మందలించడంతోనే తన కుమార్తె మానసిక వేధింపులకు గురైందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు హాస్టల్ వార్డెన్, నిర్వాహకులను విచారిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Oct 6, 2026
- 12:46 pm
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇక ఫస్ట్ ఇయర్‌లోనూ ఇంటర్నల్ మార్కుల విధానం!
ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్‌లో కొత్త పాఠ్యపుస్తకాలు, కొత్త మూల్యాంకన విధానం అమల్లోకి రానుంది. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు 20 శాతం, థియరీ పరీక్షలకు 80 శాతం మార్కులు కేటాయించారు. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, ప్రాబ్లమ్ సాల్వింగ్, సృజనాత్మకత, ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యంగా బోర్డు వెల్లడించింది..
- Vidyasagar Gunti
- Updated on: Oct 1, 2026
- 7:13 pm
మాదాపూర్‌లోని ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం.. పోలీసుల తనిఖీల బట్టబయలు..!
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఐటీ కారిడార్‌లో అక్రమంగా నడుస్తున్న రమ్మీ బెట్టింగ్ రాకెట్‌ను కూకట్‌పల్లి ఎస్‌వోటీ పోలీసులు బట్టబయలు చేశారు. విశ్వసనీయ సమాచారంతో కాకతీయ హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి, రూ.1.47 లక్షల నగదు, 25 ప్లేయింగ్ కార్డు సెట్లతో పాటు ఆరుగురిని అరెస్టు చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలను సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.
- Vidyasagar Gunti
- Updated on: Sep 25, 2026
- 10:06 am
Hyderabad: మహిళా టెకీకి ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డ్..
గచ్చిబౌలిలో రాత్రివేళ క్యాబ్ ఎక్కుతున్న 24 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఓ సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి గాలింపు చేపట్టారు.
- Vidyasagar Gunti
- Updated on: Sep 23, 2026
- 12:24 pm
ఇంట్లో భార్య, రైల్వే ట్రాక్‌పై భర్త.. దంపతుల ఆత్మహత్య.. పోలీసుల విచారణలో అసలు నిజాలు!
హైదరాబాద్ లాలాగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా లక్ష్మి ఆత్మహత్య చేసుకోగా, భార్య మృతిని తట్టుకోలేక భర్త శరణప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. దంపతులు కొద్దిసేపటి వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ కలహాలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- Vidyasagar Gunti
- Updated on: Sep 10, 2026
- 2:46 pm
మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు.. ర్యాపిడో డెలివరీలతో..
హైదరాబాద్ ఐటీ కారిడార్ కేంద్రంగా యథేచ్ఛగా సాగుతున్న నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమ విక్రయాల ముఠా గుట్టును పోలీసులు మంగళవారం రట్టు చేశారు. మాదాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 1762 సమీపంలో ఉన్న ది స్మోక్ షాప్ పై ఈగల్ టీమ్ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో చట్టవిరుద్ధంగా నిల్వ ఉంచిన భారీ పరిమాణంలో ఈ-సిగరెట్లు, వేప్స్, పాడ్స్, కార్ట్రిడ్జ్‌లు, నికోటిన్ పౌచ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Sep 8, 2026
- 9:09 pm
అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు
వారిద్దరూ లివిన్ రిలేషన్‌లో ఉన్నారు.. కలిసి ఎదగాలని ఓ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. దాన్ని మరింత విస్తరించాలనే ప్రయత్నంలో ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి.. ఈ చిన్న గొడవలే ఒకరి ప్రాణం పోవడానికి కారణం అయ్యాయి. ఇంతకూ వారి మధ్య జరిగిందేంటి.. అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Vidyasagar Gunti
- Updated on: Sep 4, 2026
- 10:06 pm
Hyderabad: 48 గంటల్లో హత్య కేసును చేధించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు.. ఎలా అంటే?
హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన హత్య కేసును పోలీసులు ఎట్టికేలకు చేధించారు. ఆలీనగర్‌లో ఆటో డ్రైవర్ హత్య కేసుతో పాటు కాటేదాన్‌లోని హర్ష్ బేకర్స్ భారీ నగదు చోరీ కేసుల్లోని ప్రధాన నిందితులను వారి సహచరులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుల్లోని బాధితులకు కూడా న్యాయం జరిగేలా చూస్తామని సీఐ తెలిపారు.
- Vidyasagar Gunti
- Updated on: Sep 4, 2026
- 8:55 pm
ఇన్-సర్వీస్ టీచర్లకు ‘TET 2026’ పరీక్షల షెడ్యూల్ విడుదల.. టైమింగ్స్ ఇవే
TGTET ఇన్ సర్వీస్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మూడు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24,983 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరుకానున్నారు. పేపర్-1, పేపర్-2 పరీక్షల తేదీలు, సమయాలు, పరీక్షా కేంద్రాల పూర్తి వివరాలను విద్యాశాఖ ప్రకటించింది..
- Vidyasagar Gunti
- Updated on: Aug 29, 2026
- 3:28 pm
హైదరాబాద్ టు గుంటూరు.. అమరావతి ఏసీ బస్సులో కళ్లు బైర్లు కమ్మే సీన్.. వెనుక సీట్లో కూర్చొని..
హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ అమరావతి ఏసీ బస్సులో లక్షల విలువైన అన్‌కట్ డైమండ్ నెక్లెస్, బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బ్యాగ్‌కు ఎలాంటి డ్యామేజ్ లేకపోవడంతో ప్రయాణికులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Aug 28, 2026
- 7:17 pm
Hyderabad: అయ్యో ఎంత పనిచేశావమ్మా.. పెళ్లై పదేళ్లైనా పిల్లలు లేరని..
పెళ్లై పదేళ్లు గడుస్తున్నా.. సంతానం లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల సునీతా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఎంతకూ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దల కొట్టగా ఈ విషాదం వెలుగు చూసింది.
- Vidyasagar Gunti
- Updated on: Aug 28, 2026
- 10:24 am
చనిపోయినా ముగ్గురికి పునర్జన్మ.. 18 ఏళ్ల యువకుడి అవయవ దానంతో నిలిచిన ప్రాణాలు!
మరణంలోనూ మరొకరికి జీవాన్ని ప్రసాదించి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఓ యువకుడు. రంగారెడ్డి జిల్లాలకు చెందిన బన్నీ అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా కీసరగుట్ట సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బన్నీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్ కారణంగా మరణించాడు.తల్లిదండ్రుల సమ్మత్తితో అతని శరీరం నుంచి 2 కిడ్నీలు, 1 లివర్‌ను సేకరించిన వైద్యులు వాటిని ఇతరులకు అమర్చీ ప్రాణాలు నిలబెట్టారు.
- Vidyasagar Gunti
- Updated on: Aug 25, 2026
- 7:09 pm