AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది

చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది

Phani CH
|

Updated on: Mar 18, 2026 | 7:45 PM

Share

ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా భారత్‌లో ఇంధన సరఫరా ఆగి, తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడింది. హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. నాగ శౌర్య తల్లి ఉషా ముల్పూరి కిచెన్ కూడా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గ్యాస్ లేక కట్టెల పొయ్యిపై వంట చేస్తూ, ఎండ, పొగలోనూ కస్టమర్ల కోసం శ్రమిస్తున్నారు. ఈ సమస్యతో హోటల్ వ్యాపారులకు సవాళ్లు పెరుగుతున్నాయి.

ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇంధన సరఫరా ఆగిపోయింది . ఈ కారణంగా ఇండియాలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ మూత పడ్డాయి. ఇక హైదరాబాదులో కూడా గ్యాస్ కొరత కారణంగా హోటల్స్, రెస్టారెంట్ యజమానులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు లేక చాలా మంది తమ హోటల్స్ ను మూసి వేస్తుండగా మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో చాలా మంది కట్టెల పొయ్యిల పైనే వంటలు కానిస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరో నాగ శౌర్య తల్లి కూడా ఇదే పని చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉషా ముల్పూరి కిచెన్ పేరుతో హైదరాబాద్ లో రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు నాగ శౌర్య తల్లి. ఓ వైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తోన్న ఆమె తన రుచికరమైన వంటకాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రా వంటకాలకు ‘ఉషా ముల్పూరి కిచెన్’ బాగా ఫేమస్. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న గ్యాస్ కొరత కారణంగా వంటలను కట్టెల పొయ్యిపై చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉషా ముల్పూరి ఆవేదన వ్యక్తం చేస్తోంది. వంట గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో మేము కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచే మా సిబ్బంది పని మొదలుపెడుతున్నారు. అయితే ఒకవైపు ఎండ, మరోవైపు పొగ ఉండటంతో ఇలా వంటలు చేయడం చాలా కష్టంగా ఉందని నాగ శౌర్య తల్లి అంటున్నారు. అయినప్పటికీ తన దగ్గరికి వచ్చే కస్టమర్లను వెనక్కు పంపించకూడదనే ఉద్దేశంతో వంటలు ఆపకుండా కొనసాగిస్తున్నామన్నారు ఉషా. గ్యాస్ సమస్య ఉన్నప్పటికీ కొన్ని వంటకాలను ప్రతిరోజూ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమ రెస్టారెంట్‌కు వచ్చే అతిథులు ఆకలితో వెనుదిరగకూడదనే ఉద్దేశంతోనే ఇలా కష్టపడుతున్నామన్నారు. అంతేకాదు కట్టెల పొయ్యిపై వండిన వంటకాలు మరింత రుచిగా ఉంటాయని తన వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు

Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి

పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత

Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

Follow Us